పుట:Chandragupta-Chakravarti.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

చంద్రగుప్త చక్రవర్తి

లాసిమేకసు టాలిమీలరాజ్యములలో నంతఃకలహములు పొడఁగట్టె. క్రీ. పూ. 281 న లాసిమేకసు సెల్యూకసుచే యుద్ధమున మడిసె. టాలమీ రాజ్యమున కర్హుండగు కెరౌనసు టాలమీ ఈతనివద్ద శరణుజొచ్చియుండె. అట్లగుట చేత నలెగ్జాండరు రాజ్యమున నీజిప్తుదప్పఁ దక్కిన భాగంబుల కీతఁడు సర్వాధికారి యయి ఈజిప్తు యువరాజును దన వశ వర్తునిగఁ జేసికొని యడ్డులేక యలరారె. ,

సెల్యూకసునకు ఆంటియోకసు నాఁబడు పుత్రుఁడు గలఁడు. సెల్యూకసు డెమిట్రియసు బిడ్డను స్ట్రాటొనిసె అను నామెను బెండ్లియాడి యుండె. ఆంటియోకసునకు నామెపయి యనురాగము గలిగెనఁట. అంతట సెల్యూకసు పుత్త్రుని యందలి ప్రేమచే నాయమ నాతనికిచ్చి వారిద్దఱను అర్థ రాజ్యమున కధికారులను జేసి పంపియుండెను. (క్రీ. పూ. 293) నాఁటి నుండియు వారల కీపౌరవాత్యదేశములను ఇచ్చివైచి తాను తన తండ్రి తాతల దేశమగు మెకడోనియాయందు కడపటి దినములు గడపవలయునను నుద్దేశము కలిగినట్లు గానుపించెడు. ఆ యుద్దేశమును నెఱవేర్చుకొను కొఱకు సెల్యూకసు క్రీ. పూ. 281 లో మెకడోనియాకుఁ బ్రయాణ మయ్యెను. వెన్వెంటనె కెరౌనసు టాలమీయుఁ జనియె మధ్య మార్గమున నీ కెరౌనసుయొక్క. విశ్వాసఘాతుకముచే సెల్యూకసు అకాల మరణము నందెను.

అతనిచే స్థాపితమయిన రాజ్యము బహుకాలము జరిగి చరిత్రమున ప్రసిద్ధిగాంచెను,