పుట:Chandragupta-Chakravarti.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

చంద్రగుప్త చక్రవర్తి

సహపాలకుఁడు పర్డిక్కాసు మడిసిన పిదప ఆన్టిపేట రాతని స్థానమునకు నియమింపఁబడియెను. అట నతనికిఁ గొన్ని చిక్కులు దటస్థించెను. సైనికులలోఁ గొందఱకు నాతఁడు ఇయ్యవలసిన ధనమిచ్చుటకు సందర్భము లతనికి వ్యతిరేకము లయ్యను. అంతట వారతనిని శిలావర్షమున నొప్పించి చంపఁ జూచిరి. ఆ తరుణమున వారినుండి యాతనిని సెల్యూకసు దప్పించె. కృతజ్ఞతఁ జూపుటకు నతఁడును సెల్యూకసునకు బేబిలోనియా ప్రభుత్వమిచ్చి యని పెను., ఇదియు సెల్యూకసునకుఁ జాలకాలము దక్కినదిగాదు. ఆన్టిగోనసు మహాబలవంతుఁ డగుటయు అతనికిని "సెల్యూకసునకును వైరము గలుగుటయుఁ దటస్థించెను. ఎంతఁ బ్రయత్నించినను ఆన్టిగోనసును నమాధాసపఱుచుట యసాధ్యమయ్యెను. క్రీ. పూ. 317 లో సెల్యూకసు ఈజిప్తునకుఁ బారిపోయి టాలమి శరణుఁజొచ్చెను. 316 లో రాజవంశము పేరైనను లేక పోవుటయు ఆన్టిగోనను ప్రజల ప్రభువగుటయు సంభవించె. అంతట నితర క్షత్రపులు- ఈజిప్తు న టాలమీయును, అతనికడఁ జేరియుండిన మన సెల్యూకసును, మెకడోనియాయందు కసాండరును లాసి మేకసును-ఆన్టిగోనసు నెడ నీర్ష్యగలవారయి యాతనిపై వైర మూని క్రీ. పూ. 315 నందుఁ గొన్ని సమాధానము లడిగిరి. దానిపయి వారికిని అతనికిని విగ్రహముపుట్టె అందు 315 మొదలు 312 వఱుకును సెల్యూకసు టాలమీ సేనానులలో నొక్కఁడుగఁ బనిచేసెను. కాని యా సంవత్సరము ప్రారంభ