పుట:Chandragupta-Chakravarti.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

చంద్రగుప్త చక్రవర్తి


పారసీక దేశమునుండి కొందఱు రాయబారులాతని నగరమునకు విచ్చేసిరి, . అప్పు డలకసుందరుఁడు వారి కుచితమర్యాదతో స్వాగతమిచ్చి వారినుండి ఆయా దేశముల స్థితిగతులను, వ్యాపారములను అందలి మార్గములను బ్రభుత్వ పద్దతులను సరసికొనియెను. దీనికిఁ గొంత కాలమునకుఁ దరువాత నలకసుందరుని బుద్దిని ధైర్యమును వెలువఱచు విశేష మొక్కటి దటస్థించెను. ఫిలిపునకు క్రొత్తగుఱ్ఱ మొండు బహుమానముగ దొఱకెను, దానిని స్వాధీనపఱచుకొని స్వారిచేయుట కెవ్వరికిని సాధ్యముగాలేదు. పెద్దవారలపాటు లన్నింటినిం జూచుచుండిన బాలుఁ డలకసుందరుఁడు "అరరె! వీరు దీనిని స్వాధీనము చేసికొన లేకున్నా రే" యని యొకటి రెండుమారులు తండ్రికి వినవచ్చు తెఱంగున గొణంగెను. అంత ఫిలిపు దన కుమారుని పొగరునకు నచ్చెరువంది యశ్వముపై నతనిని స్వారిచేయ నియోగించెను.

అంత నలక సుందరుఁడు గుఱ్ఱపునీడ దాని ముందు రానట్లు త్రిప్పి దాని నధిరోహించి డౌడు విడువసాగెను. అది కని ఎల్లరుం బ్రశంసించిరి.

అరిస్టాటిలు నా సుప్రసిద్ధుఁడగు గ్రీకు తత్వవేత్తకడ అలకసుందరుఁడు విద్యాభ్యాసము చేసెను. నైజశక్తింజేసియు గురు ప్రభావంబునను నతఁడు పదునారు వత్సరంబుల వాఁడగు సరికి ఫిలిపువలన మెకడోనియాకుఁ దానులేని సమయములఁ బ్రతినిధిగ నేమింపఁ బడియెను. తండ్రి యొక దండయాత్రకుఁ