పుట:Chandragupta-Chakravarti.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

చంద్రగుప్త చక్రవర్తి

 మగధ రాష్ట్రమునుండి పన్నులు, కప్పములు, కానుకలు దయా దాక్షిణ్యములు లేక లాగి ధనమును గుప్పలు పోసికొనినందున ధననందుఁ డాయెను. తాను సంపాదించిన ధనమును ఈతడు గంగానదిలోఁ బంచకోశములుగా బాతియుంచెనట. పైభాగము నందు నడ్డకట్టగట్టించి గంగా ప్రవాహమును ద్రిప్పి బయల్పడిన స్థలమునందు నయిదు గోతులు త్రవ్వించి వాని ప్రక్కలను రాళ్ల కట్టడముతో ననువుపఱచి లోభాగమున ధనమునించి కరగిపోసిన సీసముతో వానిని మూయించి, యడ్డకట్టను ద్రెంచి ప్రవాహము. నెప్పటి మార్గమునకు మరల్చి యా ధనము మీదుగ బోవునట్లు చేసెనట. ఈరహస్యము వెల్లడి కాకుండుటకై యాపనులయందు నియుక్తులైన పరిజనుల నెల్ల సంహరించి నట్లుగ ఒక గాధకలదు.

గ్రీకువారి వ్రాతల ననుసరించి చూడగా క్రీ. పూ. 326వ సంవత్సర ప్రాంతమున ననఁగా అలెగ్జాండరు (సికందర్) ఈ దేశము మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మగధరాజ్యము మహోన్నత్యము జెందియుండెను. ఆ దేశపు రాజునొద్ద 20,000 గుజ్జములును, 200,000 పదాతి సైన్యము, 2000 రథములును, 4000 ఏనుగులును వుండెను.

నవనందులు-మౌర్యుఁడు

మహాపద్మునకు ఇళయను పట్టపురాణియు, మురయను ఉంపుడుకతైయు గలరు. ఇళకు నెనమండ్రు కుమాళ్ళు గలిగిరి. తండ్రియయిన నందుడును, వీరును గలిపి నవనందులని పిలువ