పుట:Chandragupta-Chakravarti.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19]

పదియవ ప్రకరణము

145

'చాణక్యవటువు' అన్నపదము రాక్షస రాక్షసపక్షపాతుల వైరహేశనములనేకాక చాణక్యుని వయస్సును రాక్షసుని వయస్సుకంటె మిక్కిలియు తక్కువయని గాన్పింపఁ జేసెడిని. కొందఱి యభిప్రాయము చొప్పున చంద్రగుప్తుడు సర్వార్థసిద్ధికి మనుమఁడే యయిన నందు లతనికి పిన్నతండ్రులు కావలెను; అట్టి నందుల శైశవమునుండి కాపాడినవాఁడును మధ్యవయస్సు దాఁటినవాఁడుగను, చాణక్యుడు మధ్యవయః ప్రవిష్టుఁడుగను ఉండవలయును. *[1]

చాణక్యుఁడు పరిపూర్ణముగ దుష్టాత్ముఁడాయనిన, రాక్షసుని సామర్థ్యమును, స్వామిభక్తిని శ్లాఘించువాఁడుగ నున్నాడు. అటువంటి యమాత్యుని సురక్షితునిగ చంద్రగుప్త సాహాయ్యమునకు కూర్చి యుండనియెడల ముద్రారాక్షసమునకును ముద్రామంజూషమునకును అవకాశాస్పదతలే లేకపోయి యుండును. మిత్రునికై ప్రాణత్యాగ, మానత్యాగ, క్షేమత్యాగ, కుటుంబ త్యాగములకు అవలీలగఁ దెగించిన చందనదాసుని శ్లాఘించి కార్యార్థము కారాగృహాది పీడలకు లోఁబఱచినను, కడపట నతని లోకములకెల్ల అగ్రశ్రేష్ఠిగా నియమించు చున్నాఁడు. చంద్రగుప్తుడు వృషలుండైనను, ప్రాచీనక్షాత్రకుల జనిత పరిపాలిత రాజ్యమునకు, సింహాసన సదృశపార్థివ సాంగత్యమునుబట్టి అభిషేకము చేసినవాఁడు.

అర్ధరాజ్యదానమున కొప్పుకొని పర్వతకేశ్వరుని పిలిపించినవాఁడు విషకన్యకద్వార యాతనిని చంపినది చూచిన,

  1. *"భోఅమాత్యరాక్షస, విష్ణుగుప్తో౽హమభివాధమే" అనువాక్యమును బలుకుచు చాణక్యుడు రాక్షసునకు నమస్కరించుటయె యాతవి న్యూచనయ స్కతకుఁ జాలినంత యాధార మయ్యెడిని,