పుట:Chandragupta-Chakravarti.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18]

తొమ్మిదవ ప్రకరణము

137


గూడ యత్యంతావశ్యకంబె. అయిన చంద్రగుప్తుని కాలంబున నా శిక్షాస్మృతి మాత్ర ముండినట్లు గానరాదు.

ఎనిమిది విధముల వివాహములను జర్చించి పైనివ్రాసిన విషయములు వాకొనిన పిదప చంద్రగుప్తుని కాలమునఁ బ్రచారమునం దుండిన దాంపత్యవిమోచన చట్టముయొక్క లాభా లాభము లిట్టివని మా చదువరులకుఁ బ్రత్యేకించి నివేదించుకొనఁ బనిలేదు.

చంద్రగుప్తుని కాలమున మఱియొక చిత్రము కలదు. ఆస్తి విభాగములు చేసికొనుటకు హక్కుదారు లెల్లరును యుక్తవయస్కు లయియే యుండవలెను. యుక్తవయస్కులు గాని హక్కుదారులుండి వారికి యుక్తవయస్సు రాకముందే విభాగములుగ తీర్మానము చేయఁబడినచో వారికి అప్పులతో సంబంధము లేకుండెను. ఆస్తికి మాత్రము వారు హక్కుదారులే గాని అప్పులకు వారు ఉత్తరవాదులు గారట! 1[1]

  1. 1. అర్థశాస్త్రము పు. 3. అ. 5.