పుట:Chandragupta-Chakravarti.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17]

తొమ్మిదవ ప్రకరణము

129


పరలోకవాసులయి యుండునెడ కన్యయే శుల్క1[1] స్వీకారము చేయవచ్చునని నిర్ణయించుచున్నాఁడు. వాఖ్యాన మవసరము లేకయే పై విషయములు చంద్రగుప్తుని కాలమున రజస్వలానంతర వివాహములు సాధారణములని చాటుచున్నవి. రజస్వలానంతర వివాహములు సాధారణమను సిద్ధాంతము తేలిన పిదప బాలురకుగాని బాలికలకుగాని “అతిబాల్య వివాహములు” నాఁబరగు ననుచిత శృంఖల బంధనము దటస్థించు చుండలేదని వేరుగ వ్రాయవలయునా?

పునర్వివాహములు

“భార్యవలన పురుషునకు సజీవసంతానముగాని మగబిడ్డలుగాని కలుగకున్నను లేక సంతానమే లేకపోయినను అతఁడు మఱియొక్క ర్తెను బెండ్లాడుటకు ఎనిమిది సంవత్సరములు ఆగవలెను. భార్య మృతశిశువును గనినచో పదేండ్లు వ్యవధి కావలెను. ఆమె యాడుబిడ్డలనే కనుచుండిన పండ్రెండు సంవత్సరములు చూడవలెను. తరువాత పుత్రులు గావలెనను

  1. 1. ఈ శుల్కము నిప్పటి కన్యాశుల్కముగదా యని యెంచఁబోకుఁడి. ఆపత్కాలమున స్త్రీలకు ఉపయోగవడుటకయి వివాహసమయముల వరుఁడు ఇచ్చు ద్రవ్యరూపమగు ఆస్తికి శుల్కమని పేరు. ఆభరణరూపముగ నొసంగు ఆస్తికిని వృత్తిరూపముగనిచ్చు ఆస్తికిని స్త్రీధనమని పేరు. శుల్కమునకును స్త్రీధనమునకును భార్య సంపూర్ణస్వతంత్రురాలు. దుర్భిక్షములను, దానధర్మములకును, రోగనివారణార్థమును, ఆపత్సమయములను నీ శుల్కమును స్త్రీధనమును వినియోగించుకొనుటకుఁ గొంతవఱకు భర్తకునుగూడ స్వాతంత్ర్యముండెడిది ఇప్పటి శుల్కచ్చాయయు నచ్చటచ్చటఁ గానవచ్చునదిగాని ఈ విషయ మింకను శోదనీయము.