పుట:Chandragupta-Chakravarti.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

కొన్ని యాచారములు

రజస్వలానంతర వివాహములు

చాణక్యుఁడు అర్థశాస్త్రమున శిక్షాస్మృతి వ్రాయుచు రజస్వలానంతర కన్యలయెడ ద్రోహబుద్ది చూపువారలకొక విధమగు దండనను విధించుచున్నాడు. ఒక్కెడ కన్య రజస్వలయయి ఏడుమాసములు చెల్లినచో యామె కృపకుఁ బాత్రుడగుట తప్పుకాదని విధించుచున్నాడు. రజస్వల యయినపిదప మూఁడు సంవత్సరములు అవివాహితగ నుండు కన్యను సజాతి పురుషుఁడు అనుభవింపవచ్చును. మూడు సంవత్సరములకు పైఁబడియుండినయెడల తండ్రికిఁ జెందవలసిన విభూషణము లా కన్య స్వాధీనమున నుంచుకొనదేని ఆమెను విజాతీయుఁ డయినను అనుభవింపవచ్చును. శుద్ధచరిత్రలేని కన్యయని కన్యాస్వీకారము చేసిన తరువాత బయల్పడినచో నట్టి కన్యను త్యజింపవచ్చునని మఱియొక్కెడ లిఖింపఁబడియున్నది. అట్టి సందర్భముల శుల్కమును స్త్రీధనంబును వరునకు ఇచ్చి వేయవలసినదనియు కన్యాదాత జరిమానాకుఁ బాత్రుఁడు గావలసినదయు శాసింపఁబడినది. శుల్కమును గుఱించి వ్రాయుచు నింకొకపట్టున చాణక్యుఁడు తల్లిదండ్రు లిరువును