పుట:Chandragupta-Chakravarti.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

చంద్రగుప్త చక్రవర్తి


వ్రాసి యున్నాఁడు. దీనివలన నా పంచాయతికి లోఁబడి వైద్యులు తత్తదుచితోపకరణములం గొని సిద్ధముగ నుండు చుండిరని యర్థము. వారణాసియు తక్షశిలానగరంబును విద్యా పీఠములయి విలసిల్లి వైద్యశాస్త్ర ప్రవీణులను దేశమునకు సమర్పించు చుండెనని ఇదివఱకే వ్రాసియున్నాము. అలకసుందరుఁడు (అలెగ్జాండరు) ఈ దేశము పై దండెత్తి వచ్చునెడ గ్రీకు దేశీయులగుఁ దన భిషజ్మణుల వెంటఁ గొనివచ్చెను. పాంచాలదేశమునం దతఁడుండ నాతని సైనికులకు పాముకాటులు తప్పినవిగావు. ఆ యపాయకరమగు నుపద్రవమునుండి గ్రీకువైద్యులు దమ వారిని రక్షించుకొను మార్గము గాన లేకుండిరి. అప్పుడు అలకసుందరుఁడు హైందవ వైద్యుల సాయము వేఁడ వారు తక్షణమ వ్యాళవిషానలంబునుండి గ్రీకులను దప్పించిరి. దానిచే నాతఁడు నివ్వెరగంది హైందవ వైద్యుల శక్తి సామర్థ్యంబుల మెచ్చి తన సైనికుల కపాయకరమగు ఋజలు సంభవించినపు డెల్లను మన వైద్యులకడకే ఏగవలసినదని యాజ్ఞాపించెను. 1[1] గ్రీకు చరిత్రకారుఁడు వ్రాసిన యీ వ్రాఁతను బట్టిచూడ గ్రీకు వైద్యులకంటే హైందవ వైద్యులే అక్కాలమున నెక్కుడు విజ్ఞానము గలవారయి యుండిరనుట విస్పష్టము.

చంద్రగుప్తునికాలమున భిషజులనియు, చికిత్సకులనియు జాంగలీవిదులనియు, సూతికాచికిత్సకులనియు వైద్యులు వారి వారి యభిమాస వైద్యశాఖను బట్టి పిలువంబడుచుండిరి.

.

  1. 1. అరయన్