పుట:Chandragupta-Chakravarti.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16]

ఎనిమిదవ ప్రకరణము

121


బడిన సామగ్రి గలవాఁడగుట క్షామకాలమున రాజు ప్రజలకు భోజనమునకును విత్తనములకును ధాన్యము పంచిపెట్టుచుండు వాఁడు. ధనవంతులగు పౌరులనుండియు ఇతర రాజులనుండియు ధనము సంపాదించి క్షామనివారణార్థ ముపయోగించు చుండువాఁడు.

మన ప్రభుత్వము వారింబలె దుర్భిక్ష సమయములఁ జంద్రగుప్తుఁడు గొప్ప బాటలు వేయించుట చెఱువులు కాలువలు త్రవ్వించుట మొదలగు పనులు చేయించు చుండినట్లును తెలియపచ్చుచున్న ది.

క్షామములు ప్రతిదిన ప్రవర్తమానములుగాక ఎప్పుడో యొకప్పుడు తటస్థించుచుండినందునను తన యాదాయమున నర్థదభాగము దన్నివారణార్థము వినియోగించుటకు సార్వభౌముఁడు సన్నద్ధుఁడయి యుండుటనుబట్టియు నక్కాలమునఁ బ్రజులు క్షామమనిన వెఱపు లేనివారయియే యుండియుందురనిన ననృతము గానేరదు.

జాడ్యముల నివారణార్ధము చంద్రగుప్తుఁడు పూర్ణమగు నేర్పాటులఁ జేసియుండె ననుటకు సందేహము లేదు. ఏనుఁగులకును గుఱ్ఱములకును జికిత్సకుల నేర్పఱచినవాఁడు ఇక్కాలమునను అరుదుగ గన్పట్టు ధాత్రికలను సైన్యముల కమర్చినవాఁడు నైన సార్వభౌమునకు ప్రజల యారోగ్యమునెడ దృష్టి నిలువకున్నె? మెగాస్తనీసు పాటలీపుత్ర పరిపాలనమునకు నేర్పడిన యాఱుపంచాయతులలో నన్యదేశీయులఁ గాపాడు పంచాయతిని గుఱించి వ్రాయుచు "జబ్బుగా నున్నవారికి వలయు నుపచారముల జూగరూకులయి యొనర్చుట” యని