పుట:Chandragupta-Chakravarti.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

చంద్రగుప్త చక్రవర్తి


లును, ఇవిగాక పై శ్లోకమున నుడువంబడని మఱియొక దేశోపద్రవ కారణంబును గలదు, అది యగ్ని, ఈ మూఁడు బాధలను నివారించుటకుఁ దరతరములుగ నన్ని ప్రభుత్వముల వారును బాటుపడుచు వచ్చుచునే యున్నారు. చంద్రగుప్తుని కాలమున నతఁడెట్లు ప్రవర్తించినదియు నిట వివరించుట కర్తవ్యము.

మెగాస్తనీసు వ్రాతల ననుసరించి యక్కాలమున సర్వసాధారణముగ చంద్రగుప్తుని సామ్రాజ్యము సుభిక్షముగ నుండెననియే చెప్పవలసి యున్నది. కాని అర్థశాస్త్రమున దుర్భిక్షముల సంగతి తడవి తత్ప్రతీకార పద్దతులు వాకొనఁబడి యుండుటచే క్షామమేదో యొకప్పుడు తటస్థించినను దటస్థించి యుండవచ్చును.

కోష్టాగారాధ్యక్షుఁ1[1]డను అధికారి యొక్కరుఁడుండును. అతఁడు రాజునకయి వసూలగు సర్వసస్యాదులును పోగుచేసి కాపాడెడువాఁడు. అట్లు పోగైన భోజన సామగ్రియందు రాజెప్పుడును సగపాలుకంటె నెక్కు డుపయోగింపరాదు. తక్కుంగల యర్థభాగంబును ప్రజల యవసరముల కొఱకు తీసి యుంచుచుండిరి. ధాన్యాదులు చెడిపోకుండుటకయి ప్రతి సంవత్సరమును అదివఱకుఁ జేరినరాసుల నితరులకిచ్చి క్రొత్త పంటల ఫలంబునుండి బదులుకొనుచుందురు. ఇట్లు సేకరింపఁ

  1. 1 కోష్టమనగా జీర్ణకోశము. దానినుండి దేహపోషణమునకు వలసిన వస్తువు అని విశేషార్థము. అట్టి వస్తువులకొట్టు గావున కోష్టాగారము. అర్థశాస్త్రము సం 2. అ16