పుట:Chandragupta-Chakravarti.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

చంద్రగుప్త చక్రవర్తి


గారి బొక్కసమునకుఁ జేర్చుచుండును. వేనవేలు పశువులు రాజుగారి కుండుటంబట్టి యీ యాదాయము కొలఁదిపాటి యనుటకు వీలులేదు.

రాజునకు వరుంబడి నీనుటలో సాగుబడి భూములకు రెండవది దేశములోని వ్యాపార సముదాయము,

చంద్రగుప్తుని కాలమున నెల్ల వ్యాపారమును కోట గుమ్మమునఁ గట్టఁబడిన సుంకపు కొట్టుకడనె జరుగవలసి యుండెను. ఇతర స్థలముల వ్యాపారము జరుపుట నిషేధింపఁబడి యుండెను. వ్యాపారమునకయి రైతులును వ్యాపారస్థులును దెచ్చిన వస్తుసముదాయము సుంకము కొట్టుకడ నమ్మఁబడిన తరువాత అమ్మకపు మొ త్తమును బట్టి సుంకము వనూలు చేయఁబడుచుండెను. రైతులుగాని వస్తునిర్మాతలుగాని వస్తు సముదాయములు ఒక స్థలమునుండి మఱియొక స్థలమునకు మార్చుకొనుచో సుంకపు కొట్టుదారిని రావలసివచ్చినను వారు సుంకమీయ నవసరము లేకుండెను. వివాహార్థమును, రాజున కర్పించుటకును, రాజుగారి అండారములఁ జేర్చుటకును, మతోపయోగమునకును, ప్రసవించు స్త్రీలకొఱకును, ప్రయోజనములకొఱకును. గొనిపోఁబడు సామగ్రి సుంకము లేక తీసి కొనిపోఁబడు చుండెను. సుంకపుతరము వస్తువువెలయందు ఇరువదియైదవ వంతు మొదలు ఐదవ వంతు వఱకును గలదు. సుంకపు నిబంధనలను మీరువారకి నేరము ననుసరించి 3000 పణములవఱకును ( అనఁగా, ప్రస్తుతపు 2000 రూపాయలు )