పుట:Chandragupta-Chakravarti.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

101


క్షేత్రములకు వలయు బీజాదికములను సంపాదించి తత్తచ్చాస్త్రములఁ బ్రవీణులగు క్రింది యధికారుల సాయముం గొని దాసులను కూలివారలను ఖయిదీలను వినియోగించుకొని రాజుగారి సేద్యమును సాగించును. అందులకు నవసరమగు నుపకరణముల సిద్ధము చేయించుటయు నతనిపనియె. అతఁడు సూర్యచందాదులయు నక్షత్రములయు గతులను గమనించి కాలవైపరీత్యముల దెలియఁజేయు చుండినట్లును వాయువులను మేఘములను బరిశీలించి వర్షముల న్యూనాధిక్యము నెఱిఁగించుచుండినట్లును వర్షమాపక యంత్రముల సాహాయ్యంబున 'ద్రోణ' మను పరిమాణము నుపయోగించి వర్షపాతమును లెక్కించుచుండి నట్లును గానవచ్చుచున్నది. ఎఱువుల నుపయోగించు పద్దతులు గూడ నాతఁడే నియమించుచుండినట్లు తెలియుచున్నది. ఈ విధమున కాలవైపరీత్యములను గనిపట్టి వర్షముల న్యూనాధిక్యము నెఱింగించి వర్షపాతమును లెక్కించి యెఱువుల సారాసారంబుల నిర్ణయించి సీతాధ్యక్షుడు తన శాఖలోని యితరాధికారుల తోడంగూడ రైతులకు సాయపడుచుండెడి1[1] వాఁడు.

చంద్రగుప్తుని కాలమున గో౽ధ్యక్షుఁడను అధికారి యొక్కరుఁ డుండును. అతఁడు రాజు గారి గోవులు మున్నగు పశువుల కన్నిటికిని పాలకుఁడు. ఆ పశువులకు వలయునుపచారములు చేయించి వానివలన వచ్చు నాదాయము సతఁడు రాజు

  1. 1ప్రస్తుతము అగ్రికల్చరు డిపార్టుమెంటు వారీపనియే చేయుచున్నారు.