పుట:Chandamama 1949 01.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంక్రాంతి పండుగ పాపాయిలూ! మనకు ముఖ్యపండుగ సంక్రాంతి వస్తున్నది. అది ఏ ఒక్క మతంవారి పండుగకాదు. భాగ్యవంతులకూ, బీదలకూ అందరికీ పండుగ. అందరూ ఈ పండుహగ ఎంతో సంతోషంతో చేసుకుంటారు. అంత సంతోషానికి కారణం ఏమిటో తెలుసునా? సంక్రాంతినాటికి మన భూములన్నీ పంటలు పండుతై, చాలాభాగం పంట యిళ్లకుకూడా వస్తుంది. పశువులకు మంచిమేతవుంటుంది. బిచ్చగాళ్ళకు బిచ్చం దొరుకుతుంది. బీదా, బిక్కా, అందరి చేతుల్లోనూ డబ్బు మెదులొతూ వుంటుంది. అందరూ కడుపునిండా తింటూ సంతోషంగా వుంటారు. ఇంతకంటె నిజానికి పెద్ద పండుగ ఏముంది?

మీ చందమామ