పుట:Chandamama 1948 01.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

' వేడిగావుంది, నన్ను బయటవెయ్యి' అన్నదా ముఖం మళ్లీ నందుణ్ణి చూసి, నందుడు ముందూ వెనకా ఆలోచించ కుండా ఆ బొచ్చె పైకితీసి దానిలో ద్రావ కాన్ని కిందికి పంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటికి వచ్చి సందుడి మోకాలు ఎత్తుస నిలబడ్డాడు. ఆ ముసలాడిజుట్టూ, వొళ్ళూ, చొక్కా కూడా బంగారు రంగు లో నే వున్నాయి. "అయ్య బాబోయ్!' అన్నాడు నందుడు. “నన్నెరుగుదువా, నందుడూ ? నేనే కాంచనగంగకు రా జ ను,' అన్నాడు మరుగుజ్జు.

నందుడు తెల్లబోయి చూడసాగాడు. “నీసంగతి అంతా చూస్తూనే వున్నాను. నుపుచాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకోరహస్యం చెబుతావిను. ఆ కాంచన గంగమీదుగావున్న శిఖరం చూశావా! దాని మీదికి యొక్కి ఆ నదిలో ఎవరైతే మూడు బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆనది బంగారం అవుతుంది. ఇతరులకది నీరు గానే వుంటుంది. మరోసంగతి - యొపడైనా ఆ నదిలో అ పవిత్ర మై న నీరు పోశాడా, వాడు కాస్తా నల్లరాయి యిపోతాడు. తెలి సిందా? జ్ఞాపకంపంచుకో!" అంటూ ఆ మరగుజ్జు, సందుడు జవాబుచెప్పేలోపుగా మంటల్లోకి దూకి మాయమైనాడు.