పుట:Chandamama 1948 01.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోప సుందులు బయటికి వెళ్ళారు. నందుడు వంటింటో అన్నలకోసరం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయటి తలుపుమీద పెద్ద చప్పుడైంది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు.

నందుడు భయపడుతూ వెళ్లి తలుపు తియ్యకుండానే, "ఎవరు?" అని అడిగాడు.