పుట:Chandamama 1948 01.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూలోకంలో ఏ రాజునైనా పెళ్ళాడమని నాకు మా వాళ్ళు సలహాయిచ్చారు.కానీ నేను మానవ మాత్రులను పెళ్లాడటానికి ఎంతమాత్రమూ వొప్పుకోలేదు.

"ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతుండగా కొందరు పర్షియాదేశపు వర్తకులు పడవలలోపోతూ నన్ను చూసి వలవేసి పట్టుకున్నారు.వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు.నాపేరు నీలోత్పల."

నీలోత్పల చెప్పిన కథ విని రాజు ఆశ్ఛర్యపోయి, "నువ్వు నాగకన్యకవా?రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే,నువ్వు నాగకన్యకవైతే భూమిమీద ఎట్లా నివసించ గలిగావు? అని అడిగాడు.

 " రాజా, మేము మీలాటి మానవులము కాము. నీటిలోనూ నేలమీదకూడా నివసించగల దేవతలము.నీ కింకొక చిత్రం చూపుతాను చూడు," అంటు నీలోత్పల పరిచారికలను పిలిచి నిప్పూ, సాంబ్రాణి తెప్పించింది. నిప్పులో సాంబ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది. సాంబ్రాణి ధూపం నాలుగుమూలలా దట్టంగా అల్లుకున్నది. ఆ పొగలోనుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమైనారు. ఆ వచ్చినవారు నీలోత్పల అన్న అయిన నాగరాజు, అతని పరివరమునూ. వారంతా సముద్రంలో నుంచే వచ్చారు.
  నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణ్ అతనిచేతికిచ్చింది. నాగరాజు తన మేనల్లుణ్ణ్ చేతుల్లో తీసుకొని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమై పోయినాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణ్ తీసుకొని పారిపోయినాడని రాజుకు బయం కలిగింది. కాని కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగివచ్చి, "మామాదిరిగా మా మేనల్లుడుకుడా నీటిలో నివసించగలడో, లేడో చూడడానికి తీసుకుపోయినాను. ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండటంచేత మాలాగే నీటికింద నివసించగలడు," అని చెప్పాడు.
  కొంతకాలంపాటు నాగరాజు తన బావగారైన సింహళ రాజు ఆతిధ్యం స్వీకరించి తరువాత తన చెల్లెలిని, మేనల్లుణ్ణ్ వెంట పెట్టుకుని నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారిని ఉంచుకుని తరువాత తిరిగి పంపాడు. నాగలోకంగురించి కుమారుడు చెప్పిన వింతలు వినటమేగాని అవి చూసే భాగ్యం సింహళరాజుకు లేకపోయింది. మేనమామల ఇంటినుండి రాజు కొడుకు చిత్ర విచిత్రమైన వస్తువులనూ, జంతువులనూ తెచ్చి తండ్రి కిచ్చేవాడు.
  ఈవిధంగా సింహళదేశపు రాజు, నీలోత్పలతోటి, తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా గడిపాడు.