పుట:Chandamama 1948 01.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేదరాసి పెద్దమ్మ ప్రతివిషయంలోనూ జోక్యంకలిగించుకుంటుంది. ఎవరికీ ఆప కారం చెయ్యదు. అందరి మంచి ఆమెకే అందరికన్నా బాగా తెలుసు. కథానాయ కుణ్ణి చంపించటం తనకు క్షేమమనీ, తన కూతుర్ని వాడు చేసుకోవటం అపకారమనీ రాజుగారుపారపడవచ్చు. కాని నిజం పేదరాసి పెద్దమ్మము తెలుసు. ఆవిడ తాత్తాలికంగా రాజుగారిని మోసంచేసినా ఆ మోసంవల్ల రాజు గారికెంతో ఉపకారమే జరుగుతుంది. ఎంతోమందికి ఎన్నో రకాల ఉపకారం చేసుంది. కాని పేదరాసిపెద్దమ్మ స్వార్థం కోరదు. ఆమెకు డబ్బు అవసరంలేదు. అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావలసింది. ఆమెకు ప్రతిబంధకాలు లేవ భర్తలేడు, పిల్లలు లేరు, పెద్ద డబ్బులేదు, భవంతులులేవు. ఆమెఏమో, ఆమె హెూట లేమో! అది నాలుగు కాలాలపాటు సాగుతూ పం లేు, తనదగ్గిరికి వచ్చినవారికి ఇంత ఉపకారం చెయ్యటంకంటె పేదరాసి పెద్దమ్మకు కావలసింది లేదు.

తనమూలంగా ఇంకొకడికి రాజ్యం వచ్చినా, చక్కని చుక్క అయిన రాజు కూతురు భార్యగా దొరికినా పేదర్గాని పెద్దమ్మ తనకు దొరికినంతగా సంతోషి స్తుంది. తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది. తాను సామాన్యప్రజలో జత అయిన మనిషే అయినా అన్నితరగతులవాళ్లకూ ఆశ్రయ మిస్తుంది. తనధర్మాన గొప్పవాళ్లయినాక వారి దారిన వారిని పోనిస్తుందేగాని వారి వెంటపడి తానొక ఘరానా మనిషి కావ టానికి ప్రయత్నించదు.

డబ్బు విష యా ల లో కూడా ఆమె ఎప్పడూ పెచీలు పెట్టదు. ఏవేళకు వచ్చినా అన్నార్తులకింత తిండిపడేస్తుంది. కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు. కొందరు వరహాలిస్తారు. కొందరు ఏమీ ఇవ్వరు. అందర్నీ పేదరాసి పెద్దమ్మ సమంగానే చూస్తుంది. ఎవరు తనఇంటికి అతిధిగా వచ్చినా వారిపని పూర్తిఅయే వరకు వాళ్లను పావనదు. ఆమెదగ్గిరికిచేరి అసంతృప్తి పోందే మనిషి అంటూఉండడు.

అటువంటి అద్భుతమైనవ్యక్తి పేదరాశి పెద్దమ్మ.