పుట:Chandamama 1948 01.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరూ - రోగి

శారద ఒక కుక్కపిల్లని పెంచుతోందిట. ఆ కుక్కపిల్లకి ఓ రోజున కడుపునొప్పి వచ్చిందట. అప్పుడు, శారద వైద్తుడుదగ్గరికి పోయి మందు తెచ్చింది.

"ఈ మాత్రవేసుకో, కడుపునొప్పి పోతుంది !" అని మాత్రలడబ్బీ తెచ్చింది. కాని కుక్కపిల్ల మాత్ర ఎలా వేసుకుంటుంది ?

అందుకని, "ఉండు, ఈ గొట్టంలో మాత్ర వేసి ఊదుతాను," అని శారద ఒకగొట్టం తెచ్చి కుక్కపిల్లనోట్లో పెట్టింది.

గొట్టంలో మాత్రవేసి, శారద "పూ !" అని ఊదబోయింది.

కాని, కుక్కపిల్లే శారదకంటే ముందుగా వూదింది. ఇంకేముందీ ! మాత్ర కాస్తా శారద గొంతులోకే పోయింది !