పుట:Chandamama 1948 01.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పూర్వం ఒక ఊళ్లో ఒక ఆలూమగడూ ఉండేవాళ్ళు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశపుట్టి భార్య దగ్గిరికి వచ్చి "సామగ్రి తెస్తాను, గారెలు చేసిపెట్టు" అన్నాడు. పెండ్లాం సరేనన్నది. మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామగ్రి తెచ్చి యిచ్చి పొలం మీదికెళ్ళాడు.

పెండ్లానికేమో గారెలు చేయడం అసలు తెలియదు. గారెలు "ఎట్లాగండి చేసేదీ?" అని వాళ్ళ ప్రక్క యింటిలో వున్న బ్రాహ్మణ విధవరాలిని అడిగింది. ఆమె "ఒక శేరు వుద్దిపప్పు నీళ్లలో నానబొయ్యి... " అని యింకేమో చెప్పబోయింది. "ఓస్! నాకూ తెలిసిందిలే" అని పై మాట వినకుండ యింటికి వచ్చి నీళ్ళలో పప్పును నానబోసింది. అవతల ఏం చేయాలనో తెలియలేదు. మళ్లీ పక్కయింటామె దగ్గిరికి పోయి అడిగింది. ఆమె "ఆ పప్పును వడబోసి..." అని యింకేమో చెప్పబోయింది.

ఈ మాటు కూడా పై మాటలు వినిపించుకోకుండా "ఓస్! ఇక తెలిసిందిలే" అని యింటికి పోయి పప్పు వడబోసింది. కాని తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు.

మళ్ళీ పక్క యింతి ఆమెను పోయి అడిగింది. ఈ సారి ఆమెకి కోపం వచ్చింది. "ఏమి దీనికంత గీర్వాణం?" చెప్పేదంటా పూర్తిగావిని తెలుసుకోదు. 'ఓస్ ! నాకు తెలిసిందిలే' అని వెళ్ళీ పోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ వుంటుంది. ఈ మాటు దీని పని పట్టిస్తాను!" అని మనసుకో అనుకొని "అమ్మా ఆ పప్పులో రెండు శేర్లు వుప్పు, నాలుగు శేర్లు నీళ్ళు పోసి పొయ్యిమీదపెట్టి దించు. గారె లవుతుంది" అన్నది. ఇంటికి వచ్చి ఆ వెఱ్ఱి బాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది.

ఇంతలో పొలంనుంచి గారెలు తిందాంగదా అని గంపెడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు.


ఆండాలు, మదరాసు-నిర్మల కుమారి, కర్నూలు.
క్రొవ్విడి సీతారామారావు, విశాఖపట్నం