పుట:Chandamama 1947 07.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎలికలకు ఇళ్లు

ఈ సున్నాలో పది ఎలికెలు ఉన్నాయి. ఈ సున్నాలో మరిమూడు చిన్ని సున్నాలు గీసి, ఒక్కొక్క ఎలికెకు ఒక్కొక్క ఇల్లు వచ్చేటట్టుచేయాలి. చేయగలరా? లేకపోతే 58 పేజీలో చూడండి. మీకు తెలిసిపోతుంది.

చెట్ల భాగాలు

ఈ చదరంలో పన్నెండు చెట్లు ఉన్నాయి. ఈ భూమినీ, చెట్లనూ నలుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోవాలి. ఎవరికీ ఎక్కువ తక్కువ ఉండకూడదు. భాగించటం మీకు చేతకాకపోతే 58 వ పేజీ చూడండి తెలిసిపోతుంది. }}

అబ్బాయిలూ, అమ్మాయిలూ!
మీరు మీ అక్కలూ, అమ్మలూ, అవ్వలూ పాడుతుంటే ఎన్నో పాటలు వినిఉంటారు. అవి కాగితంమీద రాసి పంపండి. అచ్చువేసి చిన్ని చిన్ని బహుమానాలు పంపుతాను. ఇంకా పిట్టకధలు, అమ్ముమ్మ చెప్పిన శాస్త్రాలూ అన్నీకూడా పంపండి. చక్కగా బొమ్మలతో అచ్చువేద్దాము. పంపుతారు కదూ? రచనలు ఈ క్రింది చిరునామాకు పంపండి.

సంపాదకుడు

చందమామ

37, ఆచారప్పన్ వీధి, మద్రాసు 1