పుట:Chandamama 1947 07.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధారములు

అడ్డము:

1. బహుమతి.
3. ఒక పువ్వు
5. ఒక సంవత్సరము పేరు.
7. ఋషి.
9. కీడుకు వ్యతి రేకము.
10 పుట్టుక
11. వర్షము
12. సర్పము
14. స్వప్నము
16. దయ్యము
18. సంపద
19.నీటిలాగా ఉండునది.

నిలువు:

1. నాలుక మంట పుట్టించేది
2. కవిత్వము చెప్పును
3. -ఇదిలేంది గోలీకి గోలీతగలదు.
4. పిల్లలు
6. మనం నడిచేది వాటితోనే
8. అబద్దము కానిది
9. శకుంతలతల్లి
12. కాలికి తొడుగునది
13. శ్రీరాముని భార్య.
15. ముహూర్తము
16. నేల
17. సీలు వేయునది



     58 పేజీలో చిక్కుమాటకు జవాబు
          'నరసింహము'


ఈ బొమ్మ, మాఊర్లో ఓ మేస్టరుది పిల్లలూ ఇతని మొహం చూశారా, ఎవరైన సరీగా ఆన్సరుచెప్తే ఇలాగే నవ్వుతాడు. కాని సరిగా ఆన్సరు చెప్పకపోతే అతని మొహం తిరగేసి చూడండి. ఎంత కోపంగా చూస్తున్నాడో. ఇల్లాంటి మేష్టర్లు ఉండకూడదు కదూ!

బొమ్మ వేసినది:

శీతాపతిరావు అన్నయ్య

బరంపురం.


గొలుసుమాట

          చాలుచాలు - ఏమి చాలు?
          నెయ్యిచాలు - ఏమినెయ్యి?
          గొల్ల నెయ్యి - ఏమి గొల్ల?
          పాల గొల్ల - ఏమి పాలు?
          బఱ్ఱె పాలు - ఏమి బఱ్ఱె?
          పాడి బఱ్ఱె - ఏమి పాడి?
          ఇంటి పాడి - ఏమి యిల్లు?
          మామయిల్లు - ఏమి మామ?

చందమామ

సంపాదన: కాశేపల్లి శకుంతల, బందరు.