పుట:Chandamama 1947 07.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాక్షసికి ఆశ్చర్యంవేసింది. "ఏమిటీ! మీరు రాక్షసుల్ని తినే గీక్షసులా? ఏదీ పొట్టచూపించండి నేను నమ్ముతాను" అన్నాడు రాక్షసుడు.

"అయితే కిటికీదగ్గరికిరా చూపుతాను." అన్నాడు చెమిటివాడు. రాక్షసి కిటికీదగ్గరకు వచ్చేవరకు గుడ్డివాడు చాకలిబాన తీసుకుపోయి కిటికీకి అడ్డం పెట్టాడు. రక్షసి ఆబాన తడివిచూసి, "అమ్మయ్యో! ఎంతపెద్ద పొట్ట! అయితే బాబూ మీ తలకాయకూడా చూపుతారా?" అని అడిగాడు రాక్షసుడు.

గుడ్డివాడు గాడిదను లాక్కువచ్చి కిటికీముందు నిలబెట్టాడు. రాక్షసుడు గాడిదతల తడివిచూసి 'బాబో' అనుకున్నాడు లోపల. కాని బయటికి కనపడనివ్వకుండా "బాబూ! మీ అరుపుకూడా కాస్తె వినిపిస్తారా?" అని అడిగాడు.

గుడ్డివాడు మూటలోఉన్న చీమల్నితీసి గాడిద చెవులో పోశాడు. గాడిదతల అల్లల్లాడించి బిగ్గరగా, చెవులు పగిలిపోయేటట్టు ఓండ్రపెట్టింది.

పాపం! రాకాసికి హడలుపుట్టి ఆ అర్ధరాత్రే అడివిలోకి పారిపోయాడు.