పుట:Chandamama 1947 07.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగా అనగా ఒక ఊళ్లో ఒక చెమిటివాడూ ఒక గుడ్డివాడూ ఉండేవాళ్లు. వాళ్లిద్దరికీ మాంచి సావాసం ఇద్దరూ ఆ ఊళ్లోనే అడుక్కుతిని బతికేవాళ్లు. కాని ఒక్కఊళ్ళో ఎన్నాళ్లు దొరుకుతుంది వాళ్లకు బిచ్చం? అందుకని ఆ ఊరువదిలి దూరదేశాలు పోయి బతుకుదామని ఇద్దరూ కలిసి బయలుదేరారు.

దోవలో గుడ్డివాడు చెమిటివాడితో - "ఇదుగో చెమిటి మామా! మనిద్దరం ఒకమాటకు వద్దాము. నేను విన్నదెల్లా నీకు చెప్పుతాను నువ్వు చూసిందెల్లా నాకు చెప్పు. మనకు దొరికిందెల్లా చెరిసగం పంచుకుందాము." అన్నాడు.

చెమిటివాడు ఎగిరి గంతేసి 'సరే!' నన్నాడు. కొంతదూరం పోయేవరకు గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. "ఇదుగో, ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది. దాన్ని పట్టుకు తీసుకెళ్లామా, మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు." అన్నాడు.

చెమిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయాడు. అక్కడ ఒక గుంజకు గాడిద కట్టేసి ఉంది. చెమిటివాడు దాన్ని విప్పి తోలుకు వచ్చాడు.

ముగ్గురూ మళ్లీ కొంచెం దూరం పోయా