పుట:Chandamama 1947 07.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేత సాము గరిడీలు మాన్పించవచ్చు ననుకొంది. వెంటనే మంత్రిని పిలిపించి సంగతిచెప్పించి, కాత్తిసాములో ఆరితేరిన రాజకుమారుణ్ణి పిలిపించమన్నది. మంత్రి నవ్వాడు. రాణి ఆశ్చర్యపడి, "నిన్నకాక మొన్న నేర్చుకొన్న ఆడపిల్లను ఓడించలేరా? నేను నమ్మను. ఆమాత్రపువీరులు ఉండకపోరు. మహారాజుగారివల్ల మాటవస్తుందని భయపడకండి. వారికి నేను చెబుతాను," అన్నది.

మంత్రి వినయంగా చెప్పాడు:- "కాకతీయవంశచరిత్ర మీకు సరిగా తెలియదు. తాతముత్తాతలనాటి నుంచి నేను ఎరుగుదును. కత్తిసాములో ఈవంశం అందెవేసినచేయి. ఈవంశంలో పుట్టింది రుద్రమ్మ. ఐనా నేను మెప్పుకు అంటున్నానని మీకు సందేహం కలుగుతుంది. మన సేనానికొడుకు సంగతి మీరు వినేవుంటారు. కత్తిసాములో అతన్ని మించినవాళ్లు ఈ రాజ్యంలో లేరు. రేపే పిలిపించి పోటీ జరుపుదాము. మీకే నిజం తెలుస్తుంది." అన్నాడు.

మరునాడు రుద్రమ్మకూ, సేనాని కొడుకుకూ మంత్రి రాణిసమక్షాన కత్తి