పుట:Chandamama 1947 07.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఈ భాగ్యానికి పది సంవత్సరా లెందుకు. మనదగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది. దానితో చికిత్స చెయ్యి," అన్నాడురాజు.

ఫిరోజిషా పాచిక పారింది. రాజ కుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తానుకూడా కీలుగుర్రం పై ఎక్కాడు. మీట నొక్కాడు. వాయు వేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరి పోయింది.

ఫిరోజిషా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికివచ్చిచేరాడు. వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది. పెండ్లి నాటిరాత్రి బెంగాలురాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ళకష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్ళు బ్రతికారు.