పుట:Chandamama 1947 07.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       "కాకా! కాకాక్రా! అక్రా! కిర్ క్రీ! క్రా క్రా!"
       "కా అఅఅ! కా అఅఅ!క్రా అఅఅ!క్రు క్ర్ర్రీర్!"

కాకిపాటకు ఎంతటివాడైనా నిద్రలేవవలిసిందే. కాకిపాట రుషుల తపస్సు కూడా భగ్నం చెయ్యగలదు. కాని నాయుడుగారు ఎద్దుమొద్దు స్వరూపం అందుచేత ఆయన కాకిదంపతుల పాట లక్ష్యం చెయ్యకుండా గురకపెట్టి నిద్ర పోతున్నాడు.

అందుచేత మన కాకిదంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మాంచిపాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకూ పంచమస్థాయికి వెళ్లింది. ఎట్లాగయితేనేం నాయుడుగారు లేచాడు. కాని కాకిపాట ఆనందించటానికి బదులు తనచేతికర్ర కాకులమీదికి కోపంగా విసిరివేశాడు. అది కాస్తా వేపకొమ్మల మధ్య చిక్కుకు పోయింది. చేసేదిలేక, నాయుడుగారు నౌకరును ఫలహారం పట్టుకురమ్మని కేకవేసి ముఖం కడుక్కోవటానికి వెళ్లాడు.

నౌకరు నాయుడుగారి పలహారం పట్టుకొచ్చి గదిలోపెట్టి వెళ్లాడు. ఆరు ఇడ్డెనలూ, కమ్మని నెయ్యీ, గారెలూ, బిస్కట్లూ, వెన్నా, అన్నీ పళ్లెంలో ఉన్నాయి.

కాకిబావా కాకమ్మక్కయ్యా చెట్టుమీదనుంచి దిగివచ్చి ఫలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య వొక్క ఇడ్డెనూ, వొక్కగారే తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంజుకున్నారు. ఇద్దరి ముక్కులకూ వెన్న అంటింది. ఇద్దరూ కాసిని మంచి