Jump to content

పుట:Chaduvu VBS JVV.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

'పిల్లల్ని ప్రేమించలేకపోవడం కూడా కాలూ చెయ్యీ లేకపోవడం లాంటి వైకల్యమే,' అంటాడు జాన్ హాల్ట్.

పిల్లల మంచి చెడ్డలు చూచేపుడు, పిల్లలకు అవీ ఇవీ నేర్పేటపుడు మనం పిల్లల వైపు నుంచి చూడ్డం నేర్చుకోవాలని మామూలుగా చెప్పుకొంటుంటాం. కానీ జాన్ హాల్ట్ వాక్యం దీనికి సరిగ్గా వ్యతిరేకంగా కన్పిస్తుంది. పిల్లల్ని ప్రేమించేపుడు ఆ ప్రేమ వల్ల పిల్లలకి కలిగే అనుభూతి కన్నా పెద్దలకి కలిగే అనుభూతి గొప్పదనీ, ఆ అనుభూతి పొందలేకపోవడం వైకల్యంగాక మరేమిటని ఆయన వాక్యం తాత్పర్యం.

అనుభూతులు కూడా ఆకాశం నుంచి రావు. అలవరుచుకొంటేనే వస్తాయి. అలవరుచుకోడం ఎవరూ పట్టుబట్టి నేర్పిస్తే రాదు. స్వతంతంగా ప్రయత్న పూర్వకంగా నేర్చుకొంటే వస్తుంది. ఆ తర్వాత తర్వాత అది అప్రయత్నంగా సహజసిద్ధమన్నట్టుగా మారిపోతుంది. స్వభావంగా మిగిలిపోతుంది.

మనకు పేదల్ని ప్రేమించమని చెప్పేవాళ్ళున్నారు. ఇరుగుపొరుగును ప్రేమించమనేవాళ్ళు న్నారు. దేశాన్ని ప్రేమించమనీ ప్రకృతిని ప్రేమించమనీ బోధించేవాళ్ళు కావల్సినంతమంది ఉన్నారు. భగవంతుణ్ణి కూడా ప్రేమించవచ్చుననీ అదీ ఓ భక్తి రూపమనీ ఆధ్యాత్మిక వాదులు చెపుతారు. ఈ ప్రేమలన్నీ ఆత్మానందాలుగా వాళ్ళు వర్ణిస్తారు.

ఇన్ని ప్రేమలున్నా సమాజంలో పిల్లల్ని ప్రేమించడం అంత పెద్ద విషయం కాకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. పిల్లల్ని పెంచడం, పోషించడం, తర్ఫీదు ఇవ్వడం, వాళ్ళకి బుద్ధి గరపడం, వాళ్ళ మంచిచెడ్డలు చూడ్డం ముఖ్యమైనంతగా పిల్లల్ని ప్రేమించడం, ఆ ప్రేమించడంలో ఆత్మానుభూతిని పొందడం మనకు పెద్దగా ఇంకా అబ్బని విద్యలు. ఈ విద్య పిల్లల కోసం కాదు మనం నేర్చుకోవాల్సింది. మనకోసమే మనం పెద్దలుగా నేర్చుకోవాలి. ఇలా నేర్చు కొన్నప్పుడు ప్రతి టీచరూ ఎంత ప్రేమమూర్తిగా మారిపోతాడో అంతటి అనిర్వచనీయానుభూతి పాత్రుడూ అవుతాడు. పిల్లలతో కూడిన ప్రతిదీ అతనికి పరమానుభూతి నిస్తుంది. చదువు 6