పుట:CNR Satakam PDF File.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100. తే|| శ్రీయనంగ శ్రీయని చాటి చెప్పితీవు
హరిహరులకును సంకేతమంటి వీవు
తరుణియెదను నిద్రింప నద్వైతసిద్ధి
కలుగునన్నట్టి ఘనుడవు కవిసినారె!

101. తే|| యౌవనము సవ్యమౌ రీతి నరిగినపుడు
బ్రతుకు శాంతి సౌరభము పరిమళించు
యౌవనము వికటమయిన జీవనమ్ము
కంటకప్రాయ మౌనంటి కవిసినారె!

102. తే|| కవిని రవితోడ పోల్చుట ఖచ్చితమ్ము
ఏడువర్ణాలు జీర్ణించు కిట్టె - ఏక
వర్ణమును చిమ్ముచుండును వసుధలోన"
అనుచు కవితలు వ్రాసితే ఘనసినారె!

103. తే|| "ముసురు మంచును ఛేదించు పొద్దు పొడుపు
కఠినశిలల జీల్చి మొలచు గరిక మొలక
బిట్టునట్టడవి వెదురుగుట్ట పిలుపు
కవితలకు ద్రవ్యమింటి"వే ఘనసినారె!

104. తే|| అంబరము జూపు సహనమ్ము అద్భుతమ్ము
సాగరమ్ములు జూపును సహనశక్తి
ధరణి వహియించు సహనమ్ము - నరులకదియె
ఒరవడి యనుచు వ్రాసితే గురుసినారె!