పుట:CNR Satakam PDF File.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90. తే|| ద్వేషగుణమును మతము బోధింపదెపుడు
అందరిని ప్రేమతో జూడనదియె మతము
అన్ని మతముల గమ్యమ్ము లెన్నినపుడు
విశ్వకల్యాణమే నంటివే సినారె!

91. తే|| నవ్యయుగకర్త లెవరని భవ్యమతిని
ఊహగావించి యిద్దర నుంచినావు
దీని లోపలి మర్మమ్ము తెలియదామె
ఒక్కరుండుటె న్యాయమ్ము ఉరుసినారె!

92. తే|| హైదరాబాదు నుండి వారాంతమందు
చెన్నపురికేగి సినిమాల కెన్నో పాట
లిచ్చి సోమవారము వచ్చి యిచ్ఛమిార
పాఠములు జెప్పితే గురువరసినారె!

93. తే|| వ్యష్టి చైతన్య పథము సమష్టి వైపు
నడచినప్పుడె సార్థమ్ము నరులజన్మ
అని 'సమూహము వైపు ' కావ్యమ్ములోన
వ్రాసినట్టి ఘనుడ వీవు వరసినారె!

94. తే|| ఆంధ్ర విశ్వవిద్యాలయ మందు - ఛాత్ర
వర్గము సినారె యని పల్క - పలికితీవు
"కేక వేసినారె ! సినారె కీర్తి గనుచు"
అనిన తీరును మరువము ఘనసినారె!