Jump to content

పుట:CNR Satakam PDF File.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

85. తే|| "మనిషి నిజమైన వ్యక్తిత్వ మరసి చూడ
నోట్ల కట్టల లేదని నొక్కి చెప్పి
ఎవరినైన నిజాయితీ యెసగ జేయు"
ననుచు వ్రాసితీవు సుమతి! ఘనసినారె!

86. తే|| పరుగులెత్తుచు నుండెడి ప్రతిభ నీది
ఉరుకులెత్తుచు నుండెడి ఊహనీది
కదిపి మేల్కొల్పు చైతన్య కవిత నీది
కదిసి కదలించు కవివీవు ఘనసినారె!

87. తే|| "తొందరెత్త దూరాలను దూసుకొచ్చి
ఇసుక రేణువుల పగిది నింటి ముందు
రాల్చవలెనని అడుగులాత్రపడు ననుచు
వ్రాసితీవు 'సప్తతి'లోన వరసినారె!

88. తే|| దాశరధి తోడ జంటగా తరలివెళ్లి
తెలుగు ప్రాచీన వైభవ దీప్తులెన్నో
ఇతర దేశాల చల్లిన అతులచరిత!
కదలుచున్నట్టి తెలుగీవు ఘనసినారె!

89. తే|| వసుధ ఉదయించినట్టి దేవతయె అమ్మ
తనదు సుఖమును విడనాడు తరుణి తల్లి
ధారపోయును బతుకు సంతతి కొఱకని
తెలిపితే ఆర్థ్రమతివౌచు 'ధీ'సినారె!