పుట:CNR Satakam PDF File.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60. తే|| ఉడుకు రక్తము పొంగగ ఉరిని వలచి
ప్రాణములు తృణప్రాయమై బాసినట్టి
ఆ'భగత్సింగు' త్యాగమ్ము నద్భుతముగ
బుర్రకథగ రచించితే బుధ సినారె!

61. ఆ|| మంచి యెక్కడున్న మన్నించవలెనంచు
మమత పంచవలెను మహినటంచు
'రెక్కల' కవితలను చక్కగా వ్రాసితే
బోధకుండ వీవు బుధసినారె!

62. తే|| నిత్యచెతన్యశీలివై నీవు వ్రాయు
కవితలన్‌ మినీ కవితలు క్రాలుచుండె
నీదు శబ్దార్ధ చిత్రణ మీదుకెక్కె
బహుముఖీనప్రతిభనీది భళిసినారె!

63. ఆ|| క్షణముధనము కన్న గౌరవార్హమనుచు
బోధసేయుదెపుడు బుధనుతుండ
సమయ పాలనమున సరిలేరు నీకెందు
వినుతచరిత నీది వినుసినారె!

64. తే|| ఉదయ సూర్యుని గొప్పగా ఊహజేసి
వేయి కాళ్లతో కదిలెడి బిడ్డయనుచు
కవిత చెప్పిన భావాల గనివి నీవు
ప్రతిభ యననీదె తెలుపంగ వరసినారె!