పుట:CNR Satakam PDF File.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50. తే|| నీదు సాహితీ సేవల నియతిగాంచి
సంస్థ లొసగెను డాక్టరేట్ సత్కృతులను
పద్మభూషణుడవు నీవు ప్రధితకీర్తి
బిరుదులకు వెల్గు గూర్తువు వరసినారె!

51. తే|| ఎందరెందరో సుకవుల డెందములను
నీవు నిలువంగ కావ్యాల నెన్నో వ్రాసి
అంకితం బిచ్చి వెలుగుల నందినారు
స్థిరయశము నీది తెలుపంగ శ్రీసినారె!

52. తే|| నీకు శ్రేయోభిలాషులై నీదుపేర
సాహితీ పురస్కారముల్‌ సలుపువారు
లెక్కపెట్టంగ గలరయ్య మిక్కిలిగను
ఘనతయన నీదె కవిచంద్రా విను సినారె!

53. తే|| నీవు వ్రాసిన కవితల నెంచుకొనుచు
ప్రాచ్య పాశ్చాత్య భాషల పరిఢవిల్ల
అనువదించిన వారల నభినుతింతు
విశ్వవిఖ్యాతి నీదయ్య వినుసినారె!

54. ఆ|| గేయచక్రవర్తి, గేయ గంగాధర,
చలనచిత్ర సుకవి చక్రవర్తి,
నవరసాలమూర్తి, నవ్యగేయ సుకవి
బిరుదులెన్నో కలిగె ప్రియ సినారె!