ఈ పుట ఆమోదించబడ్డది
45. తే|| మాతృభాషను చదువులో మరువకుండ
చదువవలెనను నియమమ్ము సరసరీతి
రాజ్యసభలోన చెప్పిన పూజ్యమతివి
చిరయశస్కుడ వీవయ్య శ్రీసినారె!
46. తే|| ప్రజల చైతన్యమొనరించు ప్రధమకాంక్ష
ఉట్టిపడునట్లు కవితల నూర్జితముగ
ప్రగతిశీల మానవతను సుగతినిల్పి
వ్రాయుచుందువు కవితలు వరసినారె!
47. ఆ|| గళము విప్పినపుడు గంభీర మేఘమ్ము
గర్జ చేసినటుల ఘనత మించు
మానవతను పంచు మాటలనిధివీవు
మాన్యచరిత నీది మహి సినారె!
48. తే|| మంటలూ - మానవుడు కావ్యమర్మ మరసి
కేంద్రసాహిత్య అకడమిా కేలుమోడ్చి
అందజేసె పురస్కార మాదరముగ
వినుత కవితా ప్రతిభ నీది విను సినారె!
49. తే|| నీదు విశ్వంభర రచన మీదుకెక్క
కేరళ కలకత్త రషియా ధీరమతులు
స్థిరపురస్కారముల నిచ్చి శిష్టరీతి
గౌరవించిరి నిన్నెంతొ ఘనసినారె!