పుట:CNR Satakam PDF File.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. ఆ|| భాగ్యనగరమందు బహుసంఖ్య సభలలో
ముఖ్యఅతిథి వీవు ముచ్చటింప
వక్తలందు మిగుల వాసికెక్కితివీవు
పసిడి పలుకు నీది వరసినారె!

31. ఆ|| మానవతను నింప మహనీయమౌ రీతి
వచన కవిత లెన్నొ వ్రాసినావు
సమత మమత పంచు సారమతివి నీవు
కవుల ఘనుడవీవు ఘనసినారె!

32. తే|| జగతిలోన 'నాగార్జున సాగరమ్ము'
ఖ్యాతి పొందిన తీరును కథగ మలచి
గేయ కావ్యరచన చేసి కీర్తినంది
వెలుగుచున్న ఘనుడవీవు వినుసినారె!

33. తే|| నీవు పుట్టిన రోజున నియత గతిని
కొత్తపొత్తమ్ము పుట్టించు వేత్తవీవు
నవనవోన్మేష ప్రతిభతో నవ్యకవుల
వరుసలోన వెలుగుదీవు వరసినారె!

34. ఆ|| పంచబూతములిల పరిఢ విల్లిన తీరు
మనుజు బ్రతుకు క్రమము మహితరీతి
శ్రేష్ఠ కవితగాగ చెప్పె 'విశ్వంభర'
జ్ఞానపీఠ మొసగి ఘనసినారె!