మొదటికూర్పు పీఠిక
“థియసాఫికల్ సొసైటి” యను నామూంతరమునఁ బరఁగు దివ్యజ్ఞానసమాజమును సభ ముప్పదియాఱు సంవత్సరముల క్రిందట స్టాపింపఁబడి యిప్పుడు ప్రపంచమున సమస్త దేశములయందు వ్యాపించియున్నది. ఆసభవారిచేఁ బ్రచురింపఁబడిన గ్రంథములు అనేకభాషలలో ననేకుల కత్యంతానందమునిచ్చుచు, విశేషముగ మేలొనరించుచున్నయవి.
ఆసమాజము ముఖ్యోద్దేశ్యము లెవ్వియన, లోకమునందలి పెక్కు మతములయందుండు సారభూతములగు సిద్ధాంతముల వెల్లడిచేసి యామతము లన్నింటియందలి ముఖ్యాంశము లన్నియు నొక్కరీతిగనే యున్నవనియును, ఆమతము లన్నింటికి మూలమొక్కటియగు పరవిద్యయే యనియును, నిరూపించి తద్ద్వారా మానవకోటియం దంతట గలిగియుండు మత వైషమ్యముల మాన్ని సోదరభావమును, ఐకమత్యమును స్థాపించుట యొకటి. మఱియు మానవునియందును, బాహ్య ప్రపంచమునందును, అతీంద్రియములై దురూహములగు ధర్మములను తత్త్స్యములను బరిశీలించి తత్త్యసారమును స్వానుభవముచే వెల్లడి చేయుట రెండవది.
ఈ యు్దేశ్యములతో ననేక గంథము లనుభవజ్ఞాలగు వారిచే నాంగ్లేయభాషయందు వ్రాయంబడియుండ నా గంధ