బొబ్బిలియుద్ధనాటకము. 90
[అష్టమ నవమాంకముల నడుమ]
ప్రవేశకము
స్థలకము - బొబ్బిలికోటలోపల.
[అంతట వెట్టివాండ్రు ప్రవేశింతురు.]
వెట్టినాయకుఁడు. - [చేత చేపాటికఱ్ఱం బట్టుకొని నిలువంబడి, శవములను బండ్ల కెక్కింపించుట నభినయించుచు] యెట్టోడిబదుకు యేంబదుకురా నారాయుడా! ఎ'త్తండిరా ఈ పీనుగలని, బళ్లలోకి. [ఇతరులు అట్లుచేయుట నభినయింతురు.]
వెట్టినాయకుఁడు. - ఆయరె మజ్జా! యేమి శిత్రంరా ! మనము పదిబారల దూరాన వుండాలిశిన యీ ఆడంగులు రానివోసాలు, యేనిగలమీద బంగారపు అంబారీలలోను బంగారపు సవ్వారీలలోను తిరగాలిశిననోరు, మనశాత దున్నపోతుల బళ్లల్లో, యీడ్పులు పడి, గోతులలో పడతా వున్నారు ; ఏంకమ్మ మొచ్చిందిరా యీళ్లకీ ! ఇ దేలా గుం దంటే: -
[గేయము.]
హరిహరీ నారాయ ణాదినా రాయణో
కరుణించ వోయ్మమ్ము కమల లో శనుడా.
నిన్న రా తిరికోట మొన్న రా తిరికోట
వన్నెమీ రినకోట వశినపుర మాయా. హరి||
శిన్నమ్మ యిన్నాలు శిందులూ తొక్కితే,
పెద్దమ్మ పరవళ్లు పెడ తున్న దిపుడు. హరి||
పెద్ద మెల్తా దంట, శిన్న మొస్తా దంట,
వశినపురమూ మల్లి వన్నౌత దంట. హరి||
ఏమొగం పకపక యెగిరెగిరి నవ్విందొ,
ఆమొగం యెక్కెక్కి అంగలార్శింది. హరి||
ఏమొగం యెక్కెక్కి యేడస్త వుండిందో
ఆమొగం నవ్వింది అబ్బరంగాను. హరి||
రంగరా వెల్లాడు, శింగార మెల్లింది,