పుట:Bobbili yuddam natakam.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 88

స్థలకము: - బుస్సీ డేరా.

బుస్సీ. - ఇదే మాడేరాలో కూర్చుందము [అట్లు చేయుట నభినయింతురు.]

బుస్సీ. - ఎవరురా అక్కడ ?

నౌకరు. - సర్దార్, ఏమి సెలవు ?

బుస్సీ. - ఆ బాలుని వేంకటలక్ష్మమ్మను తోడ్కొనిరండు.

[నౌకర్లు అట్లే చేయుదురు. వేంకటలక్ష్మి బాలుని కుర్చీలో కూర్చుండఁబెట్టి నిలుచుండును.]

వేంక. - బాబూ, దొరగారికి సలాము చేయుము.

బాలుఁడు. - సలాము బూచీ దొలగాలికి [అని సలాము చేయును.]

బూసీ. - [టోపితీసి] సలాము చినవేంకటరాయనింగారికి - హైదరుసాహెబు, ఈయన నేమి చేయుదము ?

రాజు. - ఏనుఁగుకాల మట్టింపుఁ డని నే నప్పుడే చెప్పలేదా ?

బుస్సీ. - ఏమి పాపాత్ముఁడా. అట్లు పలికెదవు. బిడ్డల గన్నవాఁడవు కావు గదా. ఆ నిసువును చంపి అతని నోటిముందఱి యన్నమును హరించెదవా ; నీది యెట్టి రాతిహృదయ మయ్యా !

రాజు. - అటయిన మీరు నాకు చేసినమేలు సున్న. వాఁడే నా ప్రాణానకు మృత్యువు.

బుసీ. - ఎ ట్లయ్యా ?

రాజు. - పరీక్షించి చూడుఁడు.

బుస్సీ. - నౌకరులారా, దివ్యపదార్థము లన్నియు బాలునిమ్రోల పెట్టుఁడు. పుస్తకములు, కత్తి, కటారి, ఈఁటె, ఇంక వేఱుకైదువులు కూడ పెట్టుఁడు. [నౌకర్లు అట్లే చేయుదురు.]

బుస్సీ. - బాబూ, ఇందులో నీ కేమి కావలయునో దానిని తీసికొమ్ము. [బాలుడు పోయి కత్తింగైకొని రాజుమొగముమీఁదికి ఎత్తును.]

బూసీ. - బళీ! బళీ! బలారే ! బలారే! తండ్రిపగ తీర్చుకొనెడి కుమారుఁడవు బాబూ, తుపాకికడుపున ఫిరంగిలాగున పుట్టినాఁడవు. (రాజు నుద్దేశించి) రాజా, నీపాపము నిన్ను త్వరలోనే కొట్టును గాని తప్పదయ్యా. వేంకటలక్ష్మమ్మా! ఈరాజు వలన మోసపోయి మేము ఆమహాత్ములకు చేసిన కీడునకు మితిలేనిదానికి కొంచెము పరిహారముగా, ఈ చిన్నిబాలుని నీతో సురక్షితముగా పంపెదను. ఎవరు రా అక్కడ? [నౌకరు ప్రవేశించును.]