పుట:Bobbili yuddam natakam.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము.. 85

చ. - సలాం సర్కార్. రంగారావు కుడి బుజం తెగిపోయింది, యెడ్మ మోకాలికి తుపాకిగుండు తగ్లి మోకాలు పగ్లీ పోయింది. రగతం దూకుతూ వుంది. మండీ యేస్కొని యెనకాకి ముందూకి పక్కలాకి యెడ్మాచేతితో నఱుకుతాడు. సాబ్. [అని నిష్క్రమించును.]

బుస్సీ. - ఆయన యేమి యంత్రమా వీరుఁడా ! హా ! హా !

ప్ర. - సర్దార్, దగ్గిరికి వెళ్లడానికి గుఱ్ఱం చొఱడానికి సందు లెదు. రాణువ ఆయనికి చుట్టూ వెదురు పొద వుంది.

బుస్సీ. - [లేచి] అ టయిన మేమే వెళ్లి దారిచేసికొనియెదము. [రాజుంగూర్చి చిఱునవ్వుతో] మహారాజా, మీరు వచ్చిన ఆయన వచ్చునఁట గదా, మీరు కూడ రండి. [రాజు గునగునం బాఱి నిష్క్రమించును.]

బుస్సీ. - పంద ! మేమే పోయెదము. [అని పరిక్రమించును.]

చ. - సర్కార్, రంగారావు రక్తం కారికారి సొమ్మసిల్లి పోయినాడ్. మనవాళ్లు పట్టి ఎత్తబోతే తెప్పిరిల్లి మాల్లీసొమ్మసిల్లిన్యాడు. గుండెగాయంగుండా బొట్న వేలు వుండ్లే అంతహాత్మ లేచి పోయింది చెప్పిన్యార్. ఆమహాపురుషుడి ధేధీప్యమానం రూపాన్ని రాణువ అంతా, మీద మీద పడి సూస్తావున్యారు సర్కార్ ; యేడుస్తా వున్యారు కూడా. నేను వెంటనే మీకి చెప్పువెయ్యాల ఘన్క ఇక్కడ మీతోనే యేడ్వడాన్కి వచ్చిన్యాను సర్కార్.

బుస్సీ. - అటయిన మేమును అక్కడనే చూచెదము. [అని లేచి తూర్పు దెసం బరికించి] ఆహా ! సూర్యుఁ డుదయించినాఁడు! ఇతఁడిచ్చట నిన్న సంజవేళ నేమి కాంచినాఁడు! ఇపు డేమిచూడవచ్చినాఁడు! కెంపెక్కిన యీసూర్యుని ఇతని చెంగటి యీ సాంధ్యమేఘములను గనఁగా నిట్లు తోఁచుచున్నది. వీరిమతములో ఱొమ్ముగాయముల వీరులు సూర్యమండలమును భేధించుకొని వీరస్వర్గమునకేగుదురు గదా. దానంజేసి


          ఉ. రావుకులాగ్రగణ్యునికి రంగమహీపతికిన్ బ్రియంబునన్
              ద్రోవ యొసంగి త ద్రుధిర ధోరణిచే రవి దాల్చె శోణతన్ ;
              రావున కోహటి ల్కలవరంబున గుంపులువడ్డ తక్కు ర
              క్తావిల వీర కోటులు సుమా తరు ణారుణ సాంధ్యమేఘముల్.

ఉదయించిన యీ నభోమణిం గంటిని. పోయి అస్తమించిన యాధరామణిం గనియెద.

[అందఱు నిష్క్రమింతురు.]


___________