షష్ఠాంకము. 81
స్త్రీలు అందఱు. - (గేయము.)
భారతీ దేవిరో, భార్గవీ దేవిరో, పార్వతీ దేవిరో ;
దీవింపుఁ డీమమ్ము దీనలను మీయ ధీనలను దల్లులారా!
వీరపత్నుల మమ్ము వినక కనక ముందే
విడనాడు చున్నట్టి వీరే;
ప్రతిజన్మ మందుమా, ప్రాణనాథులుగాఁగ
వరమొసం గుఁడు తల్లులారా !
మాకిట్టి వంతలు మరలరా కుండఁగ
మముఁగావుఁ డీతల్లులారా!
కడపటి మా మ్రొక్కు గైకొని మామీద
కనికరింపుఁడు తల్లులారా!
[అని బాకు ఱొమ్మునకు గుఱిచేసి కొని]
రంగరంగ శ్రీ రంగారంగా కావేరి రంగా
కమలా కాంతా మనోబ్జ భృంగ కస్తూరీ రంగా.
[అని పొడుచుకొన నుంకింతురు. తెర వ్రాలును, తెరలో "గోవింద గోవింద, నారాయణ నారాయణ" పెండ్లికుమారులు బాకులు తుడుచుకొనుచు పూర్వస్థానమునకు వత్తురు. ఇతరులును అట్లే వత్తురు.
[రంగారావును అట్లే ప్రవేశించును.]
రంగ. - అయ్యలారా, మాయన్న లారా, మాతమ్ములారా, నాబంగారులారా,
సీ. విజయ బంధువులార, వేజన్మముల కైనఁ
దీర్చుకో నేర మీ పేర్చు ఋణము.
చేతు లారంగఁ బూజించితి మెవ్వారి,
ఖండించితిమి వారి ఖడ్గథార!
లీలలు మీర లాలించితి మెవ్వారి.
బడఁగ్రుమ్మితిమి వారి బాకు మొనల!
ఆఁడుబురువు లేదు! హతమయ్యె మగకూన!
కోట పా డయ్యె నింకేటి కిచట!
తే. నాదు ప్రాణంబు వెంగళ నాయకుండు
న న్నెదురు సూచు చున్నాఁడు కన్ను నొవ్వ,