పుట:Bobbili yuddam natakam.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 72

బుస్సీ. - ఏమి రాజా ? మమ్ముల నందఱను ఇక్కడ గుండాన వైచుటకు తెచ్చినారా !

రాజు. - నేను ముందే చెప్పలేదా ? నన్ను బొబ్బిలివారి బట్రా జంటిరే !

చ. - [ప్రవే.] సర్కార్, మర్గయా అనమరల్లీఖాన్ ; మర్గయా సర్కార్ ; అనరమల్లీఖాన్ ; మర్గయా :

[అని నిష్క్రమించును.

ద్వి. - [ప్రవే.] సర్కార్, పేపేఖాన్ లెగిశినాడు. మనవాళ్లు ఇప్పుడు కాపు పేటమీద వున్యారు. కాపుపేట వాళ్లకీ కిందా వుంది.

(అని నిష్క్రమించును.

తృ. - [ప్రవేశించి] మన హర్కారా వుండ్లే కూకూభాయి, ఆడు దారిలో బాణం తగిలి మర్గయా, మేం ఇంకా మర్గయాలేదు.

(అని పో నుంకించును.

దౌవాకుఁడు. - అరే హర్కారా జవాన్, నీవు ఇంకా మర్గయా లేదూ అన్యావే, నీవు కూడా మర్గయా అయినావు వోయి, లేక్పోతే యెందుకీ తెచ్చినావు వోయి ఆకూకూగాడిది షమాషారమ్?

తృ. - అరే మేము ఇంకా మర్గయా లేదూ అంటే !

దౌవా. - ఉందీ అంటే !

తృ. - అరే లేదురా అంటే !

దౌవా. - అరే ఉందీరా అంటే.

తృ. - నీకి ఇప్పుడు మర్గయా చేస్తాన్.

[అని కత్తి దూయును.

దౌవా. - ఎగ్తాళికి చెప్పినాన్ భాయి.

తృ. - నీకీ యెగ్తాళీ వుంది, మాకీ సావు వుంది.

దౌవా. - అదే నేను చెప్పినమాట. పోభాయి పో.

[తృ. నిష్క్ర.

చ. - [ప్రవేశించి] సర్కార్ సలాం, పెద్దబురుజు వుందీ లేదు, దాన్కి బేతాళం నామ్ చెప్తారు. ఆబేతాళబురుజుమీద్కి మన్వాళ్లు నిచ్చెనలు వేసియెక్తారు; ఎక్కినంత మంది ఖందకం వుందీ లేదు కిందా ; అందులో పడ్తారు. ధూరాన్కి చీమల్బారు కన్పడ్తుంది. బారు ఎక్కుతుంది, నిచ్చెన జాడించినారు లాగ బారు పడిపోతుంది. ఎల్గుబంటిబారు ఎక్తుంది, కోతుల్బారు పడ్తుంది

[అని నిష్క్రమించును.

[తృ. మిక్కిలి రోఁజుచు మహాసంభ్రమముతో ప్రవేశించును.

బూసీ. - ఏమిరా యీయడావిడి?

తృ. - సాబ్ ! ఏమిచెప్పడం ; పెద్ద ఫిరంగిగుండు నాకీభాఅని తర్ముకొనివచ్చింది, బురుజుమీదానుంచీ. నేను దాన్కీకంటే ముందు రావాలకోసం బలేపగ్గు మేవచ్చినాన్, దాన్కి చేత గాభరా అయింది.