పుట:Bobbili yuddam natakam.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంతి, శాస్త్రి, జోస్యుడు, విద్యార్థి, కవి, మాంత్రికుఁడు - బొబ్బిలిలో పెద్దచెఱువు స్నానఘట్టమునకు వచ్చిన బ్రాహ్మణులు.
ధర్మారావు - రంగారాయని బావమఱఁది. ఆతని దివాను.
హసేనాలి - గోలకొండవారి రాయబారి.
రాయనివారి సభ్యులు.
రామయ్య - రాయనివారి కరణము.
వేంకటరంగారావు, లేక, చిన్న వేంకటరాయఁడు - రంగారాయని కుమారుఁడు, బాలుఁడు.
౮ బొబ్బిలి దళవాయులు.
పడవాలు రామయ్య, ముత్త్యాలపాపయ్య - బొబ్బిలి దళవాయులు.
అప్పఁడు, సన్నాసి, కుఱ్ఱవాఁడు - బొబ్బిలి పౌరులు.
౪ పౌరులు.
౭ కోమటి చెలువలు.
దౌవారికుఁడు - బుస్సీ డేరాకడ కావలివాఁడు.
ముసేపనాల్ - బొబ్బిలికోటను కొట్టిన సర్దారుఁడు.
౪ సర్దారులు - బుస్సీక్రింద సేనాపతులు.
లాలి. - ఒక ఫ్రెంచిసర్దారుఁడు.
౪ నివేదకులు - బుస్సీకి యుద్ధవృత్తాంతమును ఎప్పటి కప్పుడు వచ్చి చెప్పుచుండువారు.
కింకరుఁడు. - విజయ రామరాజుగారి సేవకుఁడు.
సేవకులు. - బుస్సీదొరగారి నౌకరులు.
చెలికానివెంకయ్య. - రాయనింగారి బంధువు.
జక్కఁడు. - వెంగళరాయని తైనాతువాఁడు.