పుట:Bobbili yuddam natakam.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 68

(నేపథ్యమున)

[ఓరోరి, అహోబిళాన్ని, భూతనాధుణ్ణి, పెద్దగుండ్లతో మట్టి కోట మీదికి మోర్జా చెయ్యండి. రామసింగును, లక్ష్మనసింగును, భేతాళున్ని, అనుమంతుణ్ణి, చిల్లపెంకులు, చిట్టెపురాళ్లు, మంగలకత్తులు, డబ్బుల తిత్తులు, ఏగానులు, గులకరాళ్లు గట్టించి వెలమలమీదికి మోర్జాచెయ్యండి. జంట ఫిరంగులు, జబరజంగులు, బోకుమారులు, ఔటుఫిరంగులు, మగరదిండ్లు, అన్నీ తయ్యారు చెయ్యండి. కంచుఫిరంగులు గట్టించండి. చెకుముకి బారులు, 13000 తయ్యారు చెయ్యండి. 6000 జజ్జాయిబారులు, అనుపు దిద్దండి.]

ప్ర. - [ప్రవే.] విజయరామరాజుగారు యుద్ధం చూడడానికి ఏనుగ మీదికి దివాన్ హైదర్జంగుగారిని పిలుస్తున్నారు.

బుస్సీ. - పోవోయి; పోయి, తమాషా జూచిరా.

[హైదరు నిష్క్రమించును.

ప్ర. - సర్కార్, తమ పటాలం వారందఱు తిరగబాటు చేస్తున్నారు.

బుస్సీ. - ఆశ్చర్యము ! ముందు నడవ వలసినవారే !

ప్ర. - కైపు లేనిదీ వారు ఏమీ చెయ్య లే రంట.

బుస్సీ. - అవును మామాటగా బొడ్మిన్ తో వారికి సారాయి మామూలుకొలత ప్రకారము ఇమ్మని చెప్పుము.

[ప్ర. నిష్క్రమించును.

ద్వి. - [ప్రవేశించి] సర్కార్ ! తమ షోల్జర్లు షారాయి తాగీ కఫరు తప్పి ఒకరిమీదికి ఒకరు సనీలు దూసుకొంటున్నారు. ఇఖ క్షణమయినా ఆళష్యం శెయ్యడం షరి గాదు. గుండు పారించడానికి ముసేఫనాల్ మూడో సెలవు అడ్గుతారు. ఆకాశ మంత కాగడాల పట్టపగల్ అయివుంది

బుస్సీ. - వారిగుండు ముందు మిగిలిన బాగుగ నుండును. [గడియారము చూచుకొని] 12 గంట లయినవి.

(నేపథ్యమున ఫిరంగి మ్రోఁత.)

బుస్సీ. - [దద్దిరిల్లి శ్రవణ మభినయించి, కోపముతో] ఎవరురా మా కడపటి సెలవు లేకయే ఫిరంగియగాదు చేయించినాఁడు?

ద్వి. - కోటలో జాముఫిరంగీ వేశివుంటారు సర్కార్.

(అంతట హైదరు రాజును తత్తఱమునం బ్రవేశింతురు.)

రాజు. - [స్వగతము] ఈ ఫిరంగిచేత నాపని సాధించెదను [ప్రకాశము] ఏమి దొరగారూ ! ఇక నేమున్నది ? వచ్చి పడ్డారు మనమీఁదికి బొబ్బిలివారు. ఫిరంగులు. మోర్జా చేసి కొట్టుచున్నారే !