పుట:Bobbili yuddam natakam.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 62

పౌరులు. - ఏమి శ్రిత మండీ ? మరి సిద్దీలో ?

అప్ప. - వాళ్లు ఏపనిమీద వెళ్లినా అది సిద్దే; అందుకోసం సిద్దీలు. పూర్వం వాళ్లు బొమ్మరాకాసు లట. వాళ్లకి మేకలు పొట్టేళ్లు ఆటవు. ఒక్కడొక్కడూ పూటకి ఒక యెద్దుని తినేస్తాడు.

సన్నా. - కొంద రంటారు పూటకు ఒక పెద్ద శిద్ది నెయ్యి వీళ్లకి అన్నంలోకి కావాలట. అందుకోసం ఆపే రొచ్చిందట.

పౌరులు. - ఓయిబాబో ఓయిబాబో ! ఏమి యింతండీ !

అప్ప. - ఆమాట కేం గాని, నా కొక స్వాములవారు చెప్పినారు ; రొండు పాదాలు రొండు శిద్దెలు, రొండు పిక్కలు అంతకన్న రొండు పెద్ద నిలువు శిద్దెలు, తొడలు అంతకన్న రొండు పెద్ద నిలువు శిద్దెలు, పిఱ్ఱలు మఱీ ప్యాద్ధ రొండు శిద్దెలు, కడుపు వొక ప్యాద్ధ అడ్డ శిద్దె, ఱొమ్ము ఆలాంటివే రొండు నిలువు శిద్దెలు, బుగ్గలు రొండు శిద్దెలు, తలకాయ ఒక శిద్దె, ఈలాగ పుట్టినా డట వీళ్ల మూలపురుషుడు ఆమూలంగా వీళ్లకి శిద్ధీలని పేరట.

పౌరులు. - అ టయితే యీళ్లకి మనోరు సాల్లే రంటారా ?

అప్ప. - మనవారికే ఈపరాసులు చాల్లే రంటాను.

సన్నా. - అది యలాగ ? వివరంగా చెప్పు.

అప్ప. - యలాగంటే, మనదొరలు భేతాళుడి వంశస్తులు.

సన్నా. - అయ్యో నీ తెలివీ ! భేతాళనాయు డని వీరి మూలపురుషుడురా ; భేతాళుడు గాడు. ఆయన వోరుగంటి ప్రతాపరుద్రమహారాజుకాడ ప్రధాన సేనా నాయకుడుగా వుండి, తురకలని పారదోలి, వోరుగంటి యాంధ్రరాజ్యాన్ని స్థాపించినవాడు.

అప్ప. - అ దెంతమాత్రం గాదు. భేతాళుడు భేతాళుడు భేతాళుడే. ఆభేతాళుడు ఈకోటలోనే నివాస ముండి, పిశాచాలని యేలుతూ వుండేవాడు. అప్పుడు హనుమంతుడు ద్రోణపర్వతం తేవడానికి వెళ్లుతూ, మంచి తిండి వుంటే మోయడానికి బలము వుంటుం దని, భేతాళుడియింటికి చుట్టంగా వొచ్చినాడు. తన బురుజు తమకి యిద్దఱికిచాల దని, భేతాళుడు ఆక్షణాన పిశాచాలచేత హనుమంతుడికి వేఱే బురుజు కట్టించి, అది ఆయనకి బస యేర్పరిచి, అందులో తిండి పెట్ట్యాడు. అందు చేతనే యీ బురుజుకి భేతాళబురు జని, ఆబురుజుకి హనుమంత బురుజని, పేళ్లు వచ్చాయి.

సన్నా. - వహవ్వా ! వహవ్వా ! మంచి సొరకాయలురా ! పోనీ మని విన్న కొద్దీ నరుకుతున్నావు. కానీ, ఇంకా నరుకు. నీకు తగిన వినేవాళ్లే దొరికినారు !