పుట:Bobbili yuddam natakam.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

48

బొబ్బిలియుద్ధనాటకము.

మలు కాఁగానే రాజునకు లోఁగరు' అని యొకరితో నొకరు అనుకొని, గలగల పలికి, లేచిరి. కొందఱు పోయి బుస్సీని దెచ్చిరి.

రంగ. - తర్వాత ? తర్వాత ?

ధర్మా. - బుస్సీ వచ్చి - 'అయ్యా, మీ రెంతశూరులయినను దివాణమునకు వచ్చి కత్తి దూయ వచ్చునా?' అని నన్ను అడిగెను. 'నేను శ్రీ బొబ్బిలిజమీన్దారు రంగారాయనింగారి దివాన నై రాయబారము వచ్చి, ఈహైదరునోట తూలుమాట మోయించెదనా?' అని నే నడిగితిని.

సభ్యులు. - బళి ! బళి !

ధర్మా. - అంతట, బుస్సీ 'మేము ఇంతచెంతకు వచ్చియుండఁగా నైన మీజమీన్దారు స్వయముగా మాబేటికి రాక, రాయబారము పంపుట యుచితమా?' అని యడిగినాఁడు.

రంగ. - సరి. అందులకు ?

ధర్మా. - అందులకు, సత్యమున హరిశ్చంద్రుఁడు, ఔదార్య సాహసముల విక్రమార్కుఁడు, విద్యలో భోజుఁడు, ఈవిలో కర్ణుఁడు, కోపమున రుద్రుఁడు, నగు మా దొరగారు మీబేటికి మర్యాదలలో హెచ్చుతక్కువలు కలుగు నేమో యనియే రాలేదు. గాని, వేఱొండు గాదు. అట్లు వారు శంకించుట సరియే యని నా కైన మర్యాద చేతనే తమకు విశద మాయెఁ గదా? ఇపుడు వారి కేమియు మరియాద లోపము చేయమని మీరు సెలవిత్తురేని, ఈ యుత్తరక్షణములో వారిని బేటికిం దెచ్చెద. వారిని కని వారితో క్షణము భాషించినచో, వారిమైత్త్రిని మీరు వదలరు. వారిపై కుట్ర చేయు వారిని జేర్పరు.' అని జవాబు పలికితిని.

రంగ. - అంతట?

ధర్మా. - అంతట, బుస్సీ - నన్నుఁ గూర్చుండు మని, తాను గూర్చుండి, నేనుం గూర్చుండి, ఇతరులుం గూర్చుండఁగా, నన్నుం గూర్చి, - 'పోనీ ! ఆమాట కేమి ? మీ న్యాయ మెల్ల హసేనల్లీవలనఁ దెలిసినది. మీరు రాజమహేంద్రవరమునకు మాబేటికి విదేశము రామికి, కారణము తెలిసినది. మీరు కట్టనొప్పుకొన్న యగావులవలన, అందులకు సమాధాన మైనది. మా దివానుమాట తప్పించుట మాకు శక్యముగాదు. అతనిని గోలకొండ నిజాముగారు స్వయముగా నియమించినారు. అతనిసలహాప్రకారము మేము వ్యవహరించునట్లుగా, మాకు హుకుము చేసినారు. కనుక, నౌభత్తుకోటల విషయమున మీరు లోఁబడనియెడల పోరు తప్పదు. లోఁబడిన, మీకు పాలకొండసీమను బొబ్బిలికి బదులుగా మే మిచ్చెదము. అందులకు మీరు అంగీకరించిన, పోరు తప్పి, మనము