తృతీయాంకము. 47
[నేపథ్యమున.]
ఏలినవారు కొలువుతీరియే యున్నారా ? ఉన్నారు ప్రభో.
[అంతట ధర్మారావు, నెత్తుటం దోఁగుచుఁ బ్రవేశించును]
[అందఱు సంభ్రాంతులై కందురు.]
ధర్మారావు. - దండములు బావగారికి, దామర్ల ధర్మయ్యను తమయానతి నెఱవేర్చి వచ్చినాఁడను.
రంగ. - మేము సంధి కని తెల్లయుడుపుతో పొమ్మనఁగా నీరు ఎఱ్ఱయుడుపుతో నేల పోయితిరయ్యా.
ధర్మా. - ఇది తెల్ల దుస్తే; పరాసుల నెత్తుటిలో నెఱ్ఱ నైనది.
రంగ. - కూర్చుండుము. ఏమి? ఏ మయిన దచ్చట? వివరముగా చెప్పుము.
ధర్మా. - (కూర్చుండి) మేము గోపాలస్వామిని సేవించి, మ్రొక్కులు ముడుపులు గావించి, పోయి, బుస్సీకచ్చేరికి తెలుపుకొని చొచ్చితిమి. చొరఁగానే, విజయరామరాజు, ఆకచ్చేరిలో నున్నవాఁడు, నన్నుఁ జూచి, చివుక్కున లేచి, హైదరును కన్నుగీటి తోడ్కొనిపోయి, తనవ్రేలియుంగర మొకటి అతనివ్రేల నుంచి, చెవిలో ఏమియోచెప్పి, చేతిలో చేయు వేయించుకొని పోయినాఁడు. 'సంధి పొసఁగనీయకు' 'ఎంతమాత్రము పొసఁగనీయను' అన్న మాటలుగా, పెదవుల కదలికచేత తెలిసినది.
రంగ. - అంతట ? అంతట?
ధర్మా. - అంతట, - బూసీ కొలువులో లేఁడు. సర్దారులు ఇతరులును, ఇరువది నలుగురు ఉండిరి. హైదరు తనతావునకు అరుదెంచెను. నేను, 'సలాము' అనఁగానే, హైదరుజంగు దెబ్బదిన్న పామువలె, నామీఁదికి ఎగిరి - ఏమి నీ పాళెగానికి దివాణ మన్న లక్ష్యము లేదా? నౌబత్తు మానఁడు, కోట వదలఁడు, తాను బేటికిరాఁడు; తన నౌకరును నిన్నుఁ బంపినాఁడు, మాకడకు ? చూడు; కన్ను మూసి కన్ను తెఱచులోపల నీపాళెగానికోట ధూళిధూళిగా ఎగురఁగొట్టి, మిమ్ముల నందఱను మహమ్మాయి చేయించెద.' అని బొబ్బరించి, నౌభత్తు నిలిచిననే గాని మాకు వేఱు కార్యము వినంబడదు? అట్లనిపోయి మీవేఁటకానితో చెప్పుకో.' అన్నాఁడు.
రంగ. - అంతట?
ధర్మా. - అంతట, నేను 'మాదొరను తూలనాడెదవా!' అని కత్తి దూయఁగానే, హైదరుజంగు గడగడ వణఁకి ఖానుల వెనుకకు దాఁటినాడు. ఖానులు, 'ఇటువంటివెల