పుట:Bobbili yuddam natakam.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

బొబ్బిలియుద్ధనాటకము.

కొని రావలయును. పైక మెంత యడిగినను, గోలకొండసర్కారునకు, అంగీకరింపుము. లంచ మడిగిన తమలపాకుతొడిమ నైనను ఒప్పుకొనకుము.

ధర్మా. - రాజేంద్రా! పాపయ్యగారు చేయవలసినపనికి నన్ను పంపితి మని తామే అనుగ్రహించితిరి గదా ; అంతకన్న వేఱు గౌరవము నాకుం గలదా ? కార్యము పండే అగునట్లు ఎంతయేని మెలఁకువతో వ్యవహరింతునుగాని, వారు తూలఁబలికిన, వెలమపోటు రుచిచూపి వచ్చెదను. అది సమ్మతమయిన నన్నుం బంపుఁడు.

రంగ. - మాకు అదే కావలసినది. కనుక నీవే వెళ్లిరావలసినది. మఱి లేచి, నూటికి సిబ్బందిని వెంటఁగొని, సంధికి పోవుటగా, తెల్లజెండాతో తెల్లతొడుగులతో, పడవాలురామయ్య సహాయుఁడుగా, పోయి రమ్ము.

ధర్మా. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.

[అంతట వెంగళ్రావు ప్రవేశించును.

రంగ. - తమ్ముఁడా, హసానలీ కోపముతోనే పోయినాఁడా?

వెంగ. - అన్నయ్యగారికి ఏమని మనవి చేయుదును అతని పరితాపమును ! కడపట నాచేతులు పట్టుకొని, 'అయ్యా, నౌభత్తు అయినను మాన్పుఁడు. దానిం దెలిసి మీ సౌమ్యతనే చెప్పి, మీవెఱ్ఱి చెప్పక, కోట ఖాలీ చేయవల దని జాములోపల మీకు బూసీదొరవారికడనుండి కబురు పంపఁ గడం గెద.' అని చెప్పినాఁడు.

రంగ. - నీ వేమంటివి తమ్ముఁడా?

వెంగ. - మీ రన్న మాటయే అంటిని.

రంగ. - అంతట?

వెంగ. - అంతట దీనతతో సలాము లిడి వీడుకోలు వడసినాడు.

సభ్యులు. - ఇతఁడు మిక్కిలి సౌమ్యుఁడు, మిక్కిలి సజ్జనుఁడు; తురకలలో తప్పఁ బుట్టినాఁడు. ఇతడు ముందు పోయి మనలనుగూర్చి మంచిమాట చెప్పుట మంచిదే.

రంగ. - అవును. [సభంగాంచి] ఏఁ డయ్యా మాకరణము రామయ్య?

రామయ్య. - [లేచి] అయ్యా! ఉన్నాను.

రంగ. - మేము వ్రాసినట్లుగా పాపయ్యకు జాబు వ్రాసి తెమ్ము.

రామయ్య. - ఏలినవారి చిత్తము. [అని నిష్క్రమించును.

రంగ. - [వెంగళరావు నుద్దేశించి] తమ్ముఁడా, నీకు నేను పెట్టెడుపనికి నామీఁద కోపము చేయకుము. నీ వయిన మిగిలియున్న విజయరాముని వంశమునకుఁ గానీక, మరల బొబ్బిలిని, మనవంశములోనే నిలుపుదువు. నాతోగూఁడ నీవును పోర