పుట:Bobbili yuddam natakam.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

34

బొబ్బిలియుద్ధనాటకము.

మాంత్రికుఁడు. - ఈసమయములో ఆపని చేయరాదు. పొరఁబాటున విషబీజము లిందును అమృతబీజము లందును పడినయెడల కొంప మునుఁగును; ఇప్పు డే మయిన మంత్రప్రయోగము చేయవలయును.

శాస్త్రి. - మంత్రాలకు మామిడికాయలు రాలవు. ఈసమయములో ఇంద్రజాలము అక్కఱకు వచ్చును.

వేదాంతి. - శాస్త్రులుగారూ ! ఈపెండిండ్లు ఈముట్టడులు చూడఁగా లోకవృత్త మంతయు ఇంద్రజాలముగానే అగపడుచున్నది ! అయ్యా,

         ఆ. సుఖము లెల్లఁ గలలు, శోకంబులును గలల్;
              తా ననెడు తలంపు హానిఁ దెచ్చె;
              అరయ నింద్రజాల మఖిలప్రపంచంబు,
              నిత్యసత్య మాత్మ నెగడు నొకటి. ౩౬

శాస్త్రి. - అవును వాస్తవమే ! ఇట తడయఁజనదు. [అని అందఱు నిష్క్రమింతురు.

___________