పుట:Bobbili yuddam natakam.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాంకము.

29

[అంతట రోఁజుచు వేగులు ప్రవేశింతురు.]

వేగులు. - మహాప్రభో, జయం జయం యేలినవారికి. విజయరామరాజుగారు బొబ్బిలిమీదికి పరాసులని తెచ్చి ముట్టడేయించినారు. లక్షా డబ్భైవేలు గోలకొండ దండు, 24 వేలు రాజు సిబ్బంది. లోపలిపురుగు బైటికి వెళ్లడానికి, బైటిపురుగు లోపలికి రావడానికి లేదు.

రంగ. - ఇంక నే మయిన మీకు తెలియునా ?

వేగులు. - మఱేమీ తెలియదు మహాప్రభో.

రంగ. - మఱి పొండి, మీపని చూచుకొండి. [వేగులు నిష్క్రమింతురు.

రంగ. - తమ్ముఁడా, నాయెడమబుజము పట్టుకొమ్ము, ఎట్లు త్రుళ్లిపడుచున్నదో చూడు.

వెంగ. - [పట్టుకొని పరికించి] అన్నయ్యగారూ ! మన కిది శుభశకునము, విజయరాముని కైన దుశ్శకునము. కావున మనకు వీరస్వర్గ మునకు ఇది సూచకము. ఇందుకై చింతింప నేల ?

రంగ. - కాదు తమ్మయ్యా. ఇ దేమి నాగుండెలు కొట్టుధ్వని కోటతలుపును గొడ్డండ్లతో కొట్టినధ్వనివలె వినఁబడుచున్నది ! నీకు వినఁబడుట లేదా !

వెంగ. - తమరు దిగులు పడుచున్నారే అన్నయ్యగారూ !

రంగ. - హా ! ఈ సమయమున పాపయ్య లేకపోయెను గదా ? తమ్ముఁడా, అతఁడు లేమి ప్రాణము లేమియే గదా !

వెంగ. - ఏమి అన్నయ్యగారూ ! ఎన్నడు లేనిది తమరు ఈ దినము దిగులు పడుచున్నారు.

రంగ. - దిగులు గాకేమి తమ్ముఁడా ! సమయ మట్టిదిగా నున్నది నాతమ్ముఁడా ! మన మేమి -

         శా. పారావారముఁ ద్రాగివైతుమొ? గిరివ్రాతంబు భక్షింతుమో ?
              తారెన్ బొబ్బిలి వీడి శ్రీ యిపుడు నిర్దాక్షిణ్య చిత్తంబునన్.

                    అయినను దిగు లనఁగా నేమి తమ్ముఁడా !
              
              బీరం బేదుదుమో? దురాన నరికిన్ వెన్నిత్తుమో? నమ్రుఁడౌ
              వైరిం గావమొ? యెట్ట కే నొరులచే బ్రాణంబు కోల్పోదుమో. ౨౯

వాస్తవస్థితి నరసికొంట తెల్వి గాని దిగులు గాదు తమ్ముఁడా ! మఱి, మన మిక్కడ కాలహరణము చేసికొనఁ గూడదు. క్షణములో నామతీర్థము కానిచ్చి,