పుట:Bobbili yuddam natakam.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము. 19

నీలాద్రిరాయని మాటయు అవశకునమే, కాని, అది నాప్రయోగమే. అయినను, తరలఁగానే వచ్చినది.

రాజు. - హా! [అని ఆశ్చర్యపడి] ఏమి యీ ఫిరంగి ? అవశకునములే అని సిద్ధాంతము చేయుచున్నదా ?

[నేపథ్యమున కలకలమువెంట.]

              హడ్వీ హడ్వీగానే నడ్వీ యెల్లిందీగా, నడ్వీ యెల్లూతాము మేమూ;
              హడ్వీ వూరయితుంది, వూరుహడ్వయితుంది, మేమూనిల్చీనా ఠాణా.
              పడ్వా నడ్వయితుంది, నడ్వ పడ్వయితుంది, మేమూ దాటీనా యేటా,
              పడ్వా నడ్వా రెండు పాడూవెడారీగానడ్వీ యెల్లూతామూమేమూ.

రాజు. - [చెవి యొగ్గి వినుచుండి] అప్పుడే మొగలాయీ దండు కదలినదే! అబ్బా ? ఏమి యీ తురకల దర్పము !

[నేపథ్యమున]

              గోవిందా గోవిందా మాకు గొంతు గొయ్య కయ్యా.
              రామా రామా మల్లీ యిళ్లకి రానియ్యా వయ్యా.
              కొండమీద కాట్రేడా నీకూ గండదీప మెడతాం;
              ఆలుబిడ్డలకి మాకు ఆపతి అవల నెట్టవయ్యా. ౧౭

రాజు.- అరరే ! బళీ ; అప్పన్న మాదండును గూడ తరలించినాఁడే ; ఇంక మేమును క్షణములో కదలెదము [అని నిష్క్రమించును.


__________